లెఫ్ట్‌ నేతలకు జనసేన ఆపీసు వద్ద చేదు అనుభవం, పవన్‌తో రామకృష్ణ, మధు భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

  జనసేన పార్టీ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం..!

  హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో ఏపీ రాష్ట్రానికి చెందిన సిపిఎం, సిపిఐ నేతలు గురువారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ వర్గాల నుండి అనుమతి వచ్చేవరకు లెఫ్ట్ నేతలు మధు, రామకృష్ణను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదు. 10 నిమిషాల తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి పార్టీ నేతల నుండి సమాచారం రావడంతో వారిని అనుమతించారు.

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 15, 16 తేదిల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఈ పార్టీలు ఉమ్మడిగా సభలు నిర్వహించాలనే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా నుండే ఉమ్మడి సభలను ప్రారంభించాలని ఆ పార్టీ నేతలు సూచనప్రాయంగా గతంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాలపై లెఫ్ట్ పార్టీల నేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చర్చించనున్నారు.

  left leaders meeting with Janasena chief Pawan kalyan in Hyderabad

  2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అనంతపురం జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఆ జిల్లాతో పాటు రాయలసీమపై ఉండే అవకాశం లేకపోలేదనే రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

  అనంతపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ప్రభావం అధికార పార్టీపై ఉంటుందా,ఉంటే ఏ మేరకు ఉంటుందనే విషయమై చర్చ కూడ లేకపోలేదు అయితే జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లేదు. ఇప్పుడిప్పుడే పార్టీ యంత్రాంగాన్ని జనసేన సమకూర్చుకొంటుంది అయితే అదే సమయంలో వామపక్షాలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలున్నారు.

  అయితే ఈ మూడు పార్టీలు ఏ మేరకు ఇతర పార్టీల ఓట్లను తమ కూటమి వైపుకు మళ్ళిస్తారనేది ఆసక్తి కల్గిస్తోంది. అయితే అదే సమయంలో ఈ విషయమై ఇప్పటికిప్పుడే అంచనాకు రాలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఎన్నికల సమయం నాటి పరిస్థితులకు మధ్య తేడా వచ్చే అవకాశం కూడ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

  అనంతపురం జిల్లా పర్యటన తర్వాత వెంటనే విజయనగరం జిల్లాల్లో కూడ పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల పర్యటనకు సంబంధించి లెఫ్ట్ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఈ సాయంత్రానికి రెండు జిల్లాల పర్యటనకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

  అనంతపురం, విజయనగరం జిల్లాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి చర్చించేందుకు సిపిఐ, సీపీఎం నేతలు గురువారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధును జనసేన కార్యాలయం సెక్యూరిటీ గార్డులు నిలిపివేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాకు చెందిన జనసేన నాయకులతో సమావేశంలో ఉన్నారు.

  జనసేన పార్టీ నాయకుల అనుమతి వచ్చేవరకు తాము గేటు తీయబోమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో లెఫ్ట్‌పార్టీల నేతలిద్దరూ జనసేన పార్టీ కార్యాలయం గేటు బయటే 10 నిమిషాల పాటు ఎదరుచూశారు. ఈ తరుణంలో విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ నేతలు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీల నేతలు మధు, రామకృష్ణను జనసేన పార్టీ కార్యాలయంలోనికి అనుమతించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhdrapradesh state left parties leaders Madhu and Ramakrishna met Janasena chief Pawan Kalyan on Thursday at hyderabad party office. Pawan kalyan will visit Anantapur district on April 15 and 16.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి