మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు ఇక్రిశాట్‌లో చిరుతపులి పట్టివేత (పిక్చర్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్‌ జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఇక్రిశాట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఆటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు. రెండు నెలలుగా ఇక్రిశాట్‌ పరిశోధన కేంద్రం పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు.

చిరుతను పట్టుకునేందుకు ఇక్రిశాట్‌ పరిశోధన కేంద్రంలో పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. గతం లో చిరుత సీసీ కెమెరాకు చిక్కినా బోనులో బందీ కాలేదు. పులులను పట్టుకోవడంలో నిపుణుడైన నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌ సలహాలను, సూచనలు అటవీశాఖ అధికారులు తీసుకున్నారు.

ఎట్టకేలకు ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో బోనుకి చిరుత చిక్కింది. ఈ చిరుత వయసు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆరడుగుల పొడవు, 75కిలోల బరువు ఉందని ఆటవీశాఖ అధికారులు తెలిపారు.

Leopard at ICRISAT caught
English summary
After playing hide and seek for five months, the leopard in the premises of the International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) at Patencheru close to Hyderabad was caught
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X