TTD: మరోసారి చిరుత కలకలం - టీటీడీ తాజా ఆంక్షలు..!!
Tirumala: తిరుమల పరిసరాల్లో మరోసారి చిరుత కలకలం రేపింద. గతంలో కాలి నడక మార్గంలో చిరుత సంచారం..ఒక బాలికను హతమార్చటం సంచలనంగా మారింది. ఆ తరువాత కలినడక మార్గంలోనూ ఆంక్షలు అమలు చేసారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భక్తుల భద్రతలో భాగంగా టీటీడీ తాజాగా ఆంక్షలు విధించింది.
చిరుత సంచారం
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్‌రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని వాహనచోదకులు గుర్తించారు. వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది. దీంతో అవి తరచూ ఘాట్‌రోడ్లలో కనిపిస్తున్నాయి. వెంటనే అటవీ శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది. చిరుతను పట్టుకొనేందుకు చర్యలు ప్రారంభించారు.

టీటీడీ ఆంక్షలు
ఇక, సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. వన్యమృగాల సంచారం పెరుగుతుందని అప్రమత్తం చేసారు. దీంతో, అటవీ శాఖ అధికారుల సూచనలతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు భక్తులకు సమాచారం ఇచ్చింది.
సమయ పాలన
ఇక, భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు మరియు ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో, వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందని తాజాగా ఈవో పేర్కొ న్నారు. టిటిడి గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోందన్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications