గవర్నర్‌కు అధికారాలు: కేంద్రంతో కెసిఆర్ లేఖల వార్
న్యూఢిల్లీ : హైదరాబాద్‌పై గవర్నర్‌కు కల్పించిన అధికారాలపై కేంద్ర హోం శాఖ, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల నిర్వహణకు ఉమ్మడి పోలీస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఆదేశించింది. విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

గవర్నర్‌కు అధికారాలపై అప్పగించాలన్న ఆదేశాలు అప్రజాస్వామికమని పేర్కొంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బిజినెస్ రూల్స్ మార్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. 12 ప్రతిపాదిత సవరణలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరం లేదని, తెలంగాణ మంత్రి వర్గ ఆదేశాల మేరకే గవర్నర్ నడుచుకునేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ప్రతి తమ వద్ద ఉన్నట్లు ఓ న్యూస్ టీవీ చానెల్ చెప్పుకుంది. ఇది రాష్ట్రం అధికారాలలోకి కేంద్రం చొరబడడమేనని, దీన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్ళాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.












Click it and Unblock the Notifications