VV Lakshminarayana: మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని ?
ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో విశాఖ ఎంపీ సీటులో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈసారి సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
విశాఖ ఉత్తర సీటు నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వీవీ లక్షీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ సీపీ రవి శంకర్ అయ్యన్నార్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ మాజే జేడీని ఎన్నికల సమయంలో చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.


విశాఖ ఉత్తర సీటులో వీవీ లక్ష్మీనారాయణతో పాటు వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ తరపున కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ పోటీతో ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్ధులు కేకే రాజు, విష్ణుకుమార్ రాజు మధ్య ఓట్లు చీలే అవకాశముంది. ఇలాంటి సమయంలో లక్ష్మీనారాయణ ప్రాణహాని ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications