లైవ్: బియాస్ నది ట్రాజెడీ, విద్యార్థులపై ఆశలు గల్లంతు
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు కొట్టుకుపోయారు. గల్లంతైనవారిలో ఓ విద్యార్థిని ఒకతన్ని సైన్యం ఆదివారంనాడు వెలికి తీశారు. సోమవారం ఉదయం సహాయక చర్యలు చేపట్టారు మూడు మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు. ఐశ్వర్య అనే విద్యార్థిని మృతదేహాన్ని రక్షణ సిబ్బంది వెలికి తీశారు. గాలింపు ముమ్మరం చేశారు.
ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలిీతం పెద్దగా కనిపించడం లేదు. బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు బతికి ఉంటారనే ఆశలు సన్నగిల్లాయి. సంఘటనపై కమిషనర్‌తో విచారణకు ఆదేశించినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చెప్పారు. ఉన్నతాధికారుల ద్వారా సమాచారాం సేకరిస్తున్నట్లు హరీష్ రావు హైదరాబాదులో చెప్పారు.
సహాయ చర్యలు వేగవంతం చేయాలని కెసిఆర్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. అందరినీ తీసుకు రావడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు .
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయని నర్సింహారెడ్డిని, అధికారులను అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు మీడియాతో చెప్పారు.
ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. నాలుగు మృతదేహాలను మైమానిక దళం ఎయిర్‌క్రాఫ్ట్‌లో హైదరాబాదు తరలిస్తున్నారు. ఆ విమానం రాత్రి పదిన్నర గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది.
29 మంది విద్యార్థులను చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ రాత్రికి విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది.

ప్రమాదం బారిన పడని 29 మంది విద్యార్థులను మనాలి నుంచి చండీగడ్ తరలించారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలిస్తారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు సంతాపం ప్రకటించారు. సంఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌తో సోనియా ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి సంఘటనా స్థలానికి బయలుదేరారు. సంఘటన చాలా బాధాకరమని ఆయన అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటన చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థులు, సిబ్బందితో ఆమె మాట్లాడారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు

నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్లు మండి ఎస్పీ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపుచర్యలు నిలిపేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థుల తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. ఓ విమానంలో 15 మంది వెళ్లగా, మరో 9 మందిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బియాస్ నదీ తీరాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

అనుమతి లేకుండా లర్జీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన ఐదుగురు అదికారులను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.
సహాయక చర్యల కోసం అధికారుల బృందం వెళ్లినట్లు హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ చెప్పారు.
మూడు మృతదేహాలను సహాయక బృందం వెలికి తీసింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెలికి తీసిన మృతదేహాల్లో ముగ్గురిని గుర్తించారు. వారిని ఐశ్వర్య, ఆకుల విజేత, రాంబాబులుగా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, అధికారుల బృందంతో హిమాచల్ ప్రదేశ్ బయలుదేరారు. విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకుని వెళ్లడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తల్లిదండ్రులు శంషాాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, దానిపై అయోమయం నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నాయని నర్సింహారెడ్డితో వాగ్వాదానికి దిగారు.
గల్లంతైన విద్యార్థులు వీరే
సాయిరాజ్, ఐశ్వర్య, నిఖితా, పరమేశ్, అఖిల్, ఆశిష్, గాయత్రి, తరుణ్, శివ, విష్ణు, యాసిక, లిబియా, శ్రీ హర్థన్, అరవింద్, శ్రీనివాస్, విజిత, శ్రీనిధి గల్లంతైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నిర్ధారించారు.
వీరు క్షేమం: చక్రవర్తుల కిరణ్ (ఫ్యాకల్టీ), రఘువంశీ, నందమూరి బిశ్వాస్, పానుగంటి సృజన్, నితిన్, విజయ, వెనిగళ్ల రమణ్‌తేజ్, రుషిక, దీప్తి, లావణ్య, చేతన్, దివ్య, నవ్య, అచ్యుత్, హనీష్, ప్రతాప్, రాకేష్, రాఘవేంద్ర, సుహర్ష, శ్రీకాంత్, మోహన్, మౌనిక, పూర్ణశేఖర్, సుజన్.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్‌నదిలో గల్లంతైన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ముప్పిడి కిరణ్‌కుమార్ ఉన్నాడు. విద్యార్థి తండ్రి వెంకటరమణ ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న కిరణ్‌కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో గల్లంతైన కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యార్థుల క్షేమసమాచారాలు, ఇతర వివరాల కోసం తల్లిదండ్రులు, కుబుంబసభ్యులు 09816011119 నెంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications