1986లో వరదలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు ఎవరెవరు ఎంత ఇచ్చారో తెలుసా..?
భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ గతంలో ఎప్పుడు లేనంత వరదలను చవి చూసింది.విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉదృతిని ఎప్పుడు చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడం మొత్తం కూడా జలమయంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు.ఇరు రాష్ట్రాల్లో ఈ వారదల కారణంగా దాదాపు 50 మందికిపైగానే చనిపోయారని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే 1986లో వరదలు వచ్చిన సమయంలోనూ తెలుగు ఇండస్ట్రీ ఇలానే స్పందించింది. అప్పుడు వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరదలు ముంచెత్తడతంతో 250 మందికి పైగా మరణించారు. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయిలయ్యారు. రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ కదిలి పెద్ద సంఖ్యలో విరాళాన్ని అందించింది. అప్పట్లో సినీ హీరోలు అందించిన విరాళాల లిస్ట్‌ను ఓసారి పరిశీలిద్దాం..
సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు,
కృష్ణం రాజు 1.05 లక్షలు,
బాలకృష్ణ 2.50 లక్షల రూపాయిలు,
దాసరి నారాయణ రావు రూ. లక్ష,
రామానాయుడు రూ. 50 వేలు,
మెగాస్టార్ చిరంజీవి 50 వేల రూపాయలు,
అక్కినేని నాగేశ్వరరావు 25 వేలు,
అశ్వనీదత్ రూ. 10వేలు,
విక్రమ్ యూనిట్ తరుఫున రెండున్నర లక్షలు,
బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేశ్ ఖన్నాలు కూడా తమ వంతు సాయంగా చెరో లక్ష అందించారు. రజనీకాంత్, కమల్ హాసన్ రూ. 50 వేలు, నగేష్ రూ. 10వేలు ఇచ్చి తమ మంచి మనస్సు చాటుకున్నారు. హీరోయిన్లు కూడా తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ చెరో 50 వేలు అందించారు. విజయశాంతి, మాధవి, సుజాత పదివేలు, సిల్క్ స్మిత, జయమాలిని ఐదు వేలు, సింగర్ సుశీల పదివేలు, శైలజ ఐదు వేలు ఇచ్చారు. ఇప్పుడు కూడా తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసు చాటుకున్నారు మన సినీ స్టార్స్.












Click it and Unblock the Notifications