వైఎస్ జగన్ ఆపన్నహస్తం-కోలుకుంటున్న చిన్నారి హనీ.. పుట్టినరోజున కలిసి ధన్యవాదాలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా పెద్దలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సీఎం జగన్.. అడపా దడపా తన పర్యటనల్లో అనారోగ్యంత బాధపడుతూ కనిపిస్తున్న చిన్నారులపైనా దృష్టిపెడుతున్నారు. ఇదే క్రమంలో పలువురు చిన్నారులకు ఇప్పటికే సాయం అందించారు. ఇదే క్రమంలో జగన్ నుంచి కోటి రూపాయల మేర సాయం అందుకున్న బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలిక హనీ ఇవాళ ఆయన్న కలిసి ధన్యవాదాలు తెలిపింది.
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ ఇవాళ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబుతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను కలిసింది. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను కలిసిన చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు.. ఇవాళ మరోసారి ఆమెను తీసుకుని సీఎం వద్దకు వచ్చారు. హనీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెను సీఎంకు చూపించేందుకు తెచ్చారు.

అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు. హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీ.. ఇందుకు కృతజ్ఞతగా తన పుట్టినరోజున తల్లితండ్రులతో వచ్చి సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఆమెతో పాటు వచ్చిన తల్లితండ్రులు సీఎం జగన్ అందిస్తున్నసాయంతో తమ కుమార్తె కోలుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. చిన్నారి హనీని ఆశీర్వదించారు.
కోనసీమకు చెందిన చిన్నారి హనీ చికిత్స కోసం రూ. కోటి మంజూరు చేసిన సీఎం జగన్. హనీ చికిత్స తర్వాత పుట్టిన రోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు#YSJagan #CMJagan #AndhraPradesh #AndhraNews #Oneindiatelugu pic.twitter.com/U7JkWNFy8w
— oneindiatelugu (@oneindiatelugu) January 11, 2023












Click it and Unblock the Notifications