నక్కను తిని కదల్లేని స్థితిలో కొండ చిలువ, బంటుమిల్లి ఎస్సై అనుచిత ప్రవర్తన

అమరావతి: నక్కను మింగి, కదలలేక పొలంలో అవస్థ పడుతున్న కొండ చిలువను చూసిన గ్రామస్తులు దాన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని ముడ్లమూడి మండలం, బసవపురంలో చోటు చేసుకుంది.

Live Python Found In Basavapuram Village, Prakasam district

పొలాల్లోకి వచ్చిన కొండ చిలువను గ్రామస్తులు పాములు పట్టేవారి సాయంతో పట్టుకున్నారు. అనంతరం దానిని ఊరిలోకి తీసుకువచ్చారు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించేందుకు కొండ చిలువను గోనె సంచిలో బంధించారు.

ఎస్సై అనుచిత ప్రవర్తన: బంటుమిల్లిలో పరిస్థితి ఉద్రిక్తం

ప్రయాణికుల కోసం బస్సు ఆపి, రోడ్డు పక్కన టీ తాగుతున్న కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా బంటుమిల్లిలో చోటుచేసుకుంది. బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు బంటుమిల్లి ప్రధాన సెంటర్‌లో రోడ్డు పక్కన ఆపి టీ తాగేందుకు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎస్సై పి.వాసు బస్సు ఆగి ఉండటాన్ని గమనించి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు వచ్చే టైం అయిందని, ఐదు నిమిషాలలో వెళ్లిపోతామని కండక్టర్‌కు నచ్చజెప్పాడు. అయితే ఇదేమీ పట్టించుకోని ఎస్సై, కండక్టర్ చొక్కా పట్టుకుని అసభ్యంగా దూషించాడు.

అంతేకాదు, కండెక్టర్ చేతిలో ఉన్న టికెట్ల యంత్రాన్ని (టిమ్స్) లాక్కుని వెళ్లాడు. ఇదంతా గమనించిన ప్రయాణికులు ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఆర్టీసీ యూనియన్ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+