స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం.. రంగంలోకి జనసేనాని పవన్, బీజేపీ నుండి కేంద్ర మంత్రులు
ఏపీలో ఎన్నికల సమరం జరుగుతుంది. స్థానిక పోరుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తు పెట్టుకున్న బీజేపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సంబంధించి కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక నేడు దీనికి సంబంధించి బీజేపీ ,జనసేన పార్టీలు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇక జనసేన నుండి పవన్ , బీజేపీ నుండి కేంద్ర మంత్రులు రంగంలోకి దిగనున్నారని తెలుస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ,జనసేన వ్యూహాలు
ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ, జనసేన నేతలు ప్రకటించారు. ఇక అంతే కాదు ఎన్నికల ప్రచారానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికలలో అయినా సత్తా చాటాలని భావిస్తుంది. అందుకే బీజేపీతో కలిసి వ్యూహాత్మకంగా జనసేన పార్టీ ఎన్నికలకు వెళ్తుంది .ప్రచారం చెయ్యటానికి కసరత్తు ప్రారంభించింది.

ప్రచార పర్వంలో పవన్ , బీజేపీ నుండి కేంద్ర మంత్రులు
ఇక ప్రచార పర్వంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే లాభం చేకూరుతుంది అని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలు సహా 8 జిల్లాల్లో పవన్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తిగానే ప్రచారం ప్రారంభించనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బీజేపీ తరఫున ప్రచారానికి ఏకంగా కేంద్ర మంత్రులే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video


పార్టీల బలాబలాల మేరకు అభ్యర్థుల ఎంపిక .. బలం పుంజుకునే వ్యూహం
ఈసారి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ కేంద్ర మంత్రులను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో బలం పుంజుకోవాలని ప్రయత్నం చేస్తుంది . ఇదిలావుంటే కీలక జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జనసేన పార్టీ సమన్వకర్తలకు అప్పగించారు. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఇరుపార్టీల నేతల బలాబలాలను పరిశీలించి, ఎవరు బలమైన అభ్యర్థి అనుకుంటే వారికే సీటు కేటాయించాలని నిర్ణయించారు. ఇక అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications