రైలు వెళుతున్నప్పుడు లోకో పైలెట్ నిద్రపోతే..?

మనకు రోడ్డుమీద, ఎక్స్ ప్రెస్ వేమీద, జాతీయ రహదారులపై మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదానికి గురైన వాహనాలను చూస్తూనే ఉంటాం. వాటిని నడిపే డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి పట్టాలమీద వేగంగా దూసుకెళుతున్న రైలు డ్రైవర్ నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

రైలును నడిపేటప్పుడు లోకోపైలెట్లు ఇద్దరు ఉంటారు. ఒకరు సీనియర్ అయితే, మరొకరు అసిస్టెంట్ లోకో పైలెట్. సీనియర్ లోకో పైలట్ నిద్రలోకి జారుకుంటే అసిస్టెంట్ పైలట్ వెంటనే అప్రమత్తం చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే లోకో పైలెట్ ను అలర్ట్ చేయడానికి విజిలెన్స్ కంట్రోల్ డివైస్ మైక్రో కంట్రోలర్ ను ఆధారంగా చేసుకొని ఒక భద్రతా పరికరం ఉంటుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేడు అనుకున్న సమయంలో ఇది రైలు బ్రేకులను అప్లై చేస్తుంది.

loco pilot falls asleep while the train is going..?

ప్రతి 60 సెకన్లకు పైలట్ కానీ, అసిస్టెంట్ పైలట్ కానీ ఏదో ఒక పనిచేస్తుండాలి. రైలు వేగం పెంచడం.. లేదంటే తగ్గించడం, హారన్ కొట్టడం లాంటివి చేస్తుండాలి. అలా చేయని పక్షంలో ఇంజన్‌లోని ఓ లైట్ 8 సెకన్ల పాటు బ్లింక్ అవుతుంది. అప్పుడు పైలట్ అప్రమత్తమైతే సరి.. లేదంటే మరో 8 సెకన్లపాటు బజర్ సౌండ్ వస్తుంది. 16 సెకన్లపాటు ఆడియో విజువల్ ఇండికేషన్ వస్తుంది. అప్పటికీ పైలట్ కానీ, అసిస్టెంట్ పైలట్ కానీ స్పందించకపోతే లోకోమోటివ్ పవర్ డౌనవుతుంది.. అది బ్రేక్స్ ఆటోమాటిక్ గా అప్లై అయ్యి రైలు ఆగిపోతుంది.

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఏప్రిల్ 8వ తేదీ నుంచి తిరగబోతోంది. ఏ మార్గంలో తిప్పాలనే విషయమై ఇప్పటివరకు అధికారులు తర్జన భర్జన పడ్డారు. చివరకు నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ నడిచే మార్గంలోనే వందేభారత్ ను కూడా నడపబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోజు వర్చువల్ గా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఒక వందే భారత్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+