ఏపీలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం- లెవెల్ క్రాసింగ్‌పై ట్రాఫిక్ జామ్
పుట్టపర్తి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

ఏపీలో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండటం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. భారీగా వాహనాలు రాకపోకలు సాగించే లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు వచ్చినప్పుడు గేట్ వేయలేదు. లెవెల్ క్రాసింగ్ వద్ద విధి నిర్వహణలో ఉంటూ రైలు వచ్చినప్పుడు వాహనాలు రాకపోకలు సాగించకుండా అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్ వేయాల్సిన ఉద్యోగి గైర్హాజర్ కావడం దీనికి కారణం.
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన సంభవించింది. పులివెందుల వైపు నుంచి కదిరికి వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ లెవెల్ క్రాసింగ్. ఈ లెవెల్ క్రాసింగ్ దాటిన వెంటనే కదిరి టౌన్ మొదలవుతుంది. రాత్రి భారీగా వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ముంబై ఎక్స్‌ప్రెస్ అటుగా వచ్చింది. తమిళనాడలోని నాగర్ కోయిల్ నుంచి ముంబై వెళ్లాల్సిన నంబర్ 16340 నంబర్ ఎక్స్‌ప్రెస్ అది.
కదిరి: రైలు వస్తున్న సమయంలో గేట్ వేయని రైల్వే గేట్ మ్యాన్.. తప్పిన ప్రమాదం..!! pic.twitter.com/88CbwllnaS
— oneindiatelugu (@oneindiatelugu) June 3, 2023
కదిరి రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. స్టేషన్ ఇంకా కొద్దిదూరంలో ఉందనగా.. గేట్ మెన్ గేట్ వేయకపోవడం వల్ల లెవెల్ క్రాసింగ్ వద్ద భారీగా వాహనాలు రాకపోకలు సాగించడాన్ని ముంబై ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తం అయ్యారు. ఎమర్జెన్సీ బ్రేక్‌ను అప్లై చేశారు. దీనితో లెవెల్ క్రాసింగ్‌కు 10 మీటర్ల దూరంలో ఆగిపోయింది ముంబై ఎక్స్‌ప్రెస్.
ఆ సమయంలో అక్కడున్న రూమ్‌లో గేట్ మెన్ విధి నిర్వహణలో లేకపోవడాన్ని వాహనదారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలు ఆగిపోవడాన్ని చూసిన గేట్ మెన్ పరుగెత్తుకుంటూ రూమ్ వద్దకు రావడం ఈ వీడియోలో కనిపించింది. సకాలంలో ముంబై ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ అప్రమత్తం కావడం, అత్యవసర బ్రేక్‌ను వేసి రైలును ఆపడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టయింది. లేదంటే వాహనాల మీదుగా ఈ రైలు దూసుకెళ్లేదే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications