పదో రోజు అదే సీన్: ప్రారంభమైన 6 ని.లకే లోకసభ వాయిదా
న్యూఢిల్లీ: లోకసభలో పదో రోజు కూడా అదే తంతు. కేంద్రంపై మంగళవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాలేదు. లోకసభ ప్రారంభం కాగానే సభ్యులు అవిశ్వాస తీర్మానానికి, కావేరీ బోర్డు ఏర్పాటుకు.. ఇలా పలు పార్టీలు పలు డిమాండ్లతో నిరసన తెలిపాయి.

దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే వాయిదా పడింది. ప్రధానంగా తమిళనాడు ఎంపీలు కావేరీ బోర్డు కోసం డిమాండ్ చేయడంతో సభ సజావుగా సాగడం లేదు. మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి కనిపించింది.
ఆ తర్వాత పన్నెండు గంటలకు ప్రారంభమైన లోకసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ఆర్డర్‌లో లేదని స్పీకర్ లోకసభను వాయిదా వేశారు. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలంటే సభ ఆర్డర్‌లో ఉండాలని కేంద్రమంత్రి అనంత్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications