‘పట్టిసీమ పూర్తయితే జగన్ పార్టీ గల్లంతే’
కడప: పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే పిల్ల కాంగ్రెస్ కనుమరుగవుతుందని అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని కార్యాలయంలో పార్టీ జెండాను బుధవారం లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని వివరించారు.
మనుగడ కోసమే జగన్ యాత్ర: చిన్నరాజప్ప

రాజకీయ మనుగడ కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్ర చేపట్టారని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ఆరోపించారు. ఈడీ కేసులపై జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని స్పష్టం చేశారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసలు నిందితుల పేర్లను బయటకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈడి కేసులపై జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి చిన్న రాజప్ప నిలదీశారు.












Click it and Unblock the Notifications