సిఐడి అధికారులు వైసిపి కార్యకర్తల్లా; మూర్ఖుడు రాజ్యమేలితే ఇంతే: జగన్ పై లోకేష్ ఆగ్రహం

టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబును సీఐడీ పోలీసులు గురువారం నాడు అర్ద్రరాత్రి అరెస్ట్ చేసారు. అశోక్ బాబు గురువారం రాత్రి ఒక వివాహానికి హాజరై పటమటలంకలోని తన నివాసానికి తిరిగి వచ్చిన క్రమంలో, అప్పటికే వేచి చూస్తున్న సీఐడీ అధికారులు ఆయన రాగానే అదుపులోకి తీసుకున్నారు. పదోన్నతి కోసం అశోక్ బాబు డిగ్రీ చదవక పోయినా చదివినట్లుగా నకిలీ సర్టిఫికెట్ సమర్పించారంటూ, నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై పరుచూరి అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు.

ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను

ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను

టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును అరెస్ట్ చేయడంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు. మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నిటినీ చెరబడతాడనడానికి వైయస్ జగన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని లోకేష్ మండిపడ్డారు. అర్ధరాత్రి అక్రమంగా టిడిపి నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

ఉద్యోగుల తరపున పోరాడటం అశోక్ బాబు చేసిన నేరమా?

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్ట్ చేసిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నారా లోకేష్. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చెయ్యమని నిలదీయడం ఆయన చేసిన తప్పా? పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరపున పోరాడటం నేరమా? అంటూ ప్రశ్నించారు. సిఐడిని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకొని వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఆ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు

ఆ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు

స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ ని గుడ్డిగా అమలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. మా పార్టీ నాయకుడు అశోక్ బాబును అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న లోకేష్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం పాటుపడిన అశోక్ బాబుపై ప్రతీకార చర్య ఇది అంటూ ఆరోపణలు గుప్పించారు.

వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా సిఐడి అధికారులు

వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా సిఐడి అధికారులు

సిఐడి అధికారులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి నిబంధనను ఉల్లంఘిస్తున్నారని, అందుకు ఫలితం అనుభవిస్తారని లోకేష్ పేర్కొన్నారు. ఉద్యోగుల పిఆర్సి కోసం అశోక్ బాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని అక్కసుతోనే అశోక్ బాబుపై తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పులుంటే ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో భయపడుతున్నారని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+