వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అపర భగీరథుడు’: బాలకృష్ణ, లోకేష్ పోలవరం టూర్(ఫొటోలు)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. పట్టిసీమకు రూపకల్పన చేసిన చంద్రబాబు... అపర భగీరథుడిగా నిలిచారని కొనియాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. పట్టిసీమకు రూపకల్పన చేసిన చంద్రబాబు... అపర భగీరథుడిగా నిలిచారని కొనియాడారు.

బాబు పేరు గుర్తుంటుంది..

బాబు పేరు గుర్తుంటుంది..

చంద్రబాబునాయుడి పేరును రాయలసీమ ప్రజలు ఎప్పటికీ చెప్పుకుంటారని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం చొరవతో పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పోలవరం సందర్శన యాత్ర చేసిన సందర్భంగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలవరంకు విహారయాత్రలానే..

పోలవరంకు విహారయాత్రలానే..

కాలేజీ విద్యార్థుల విహారయాత్ర తరహాలో ఏపీ అసెంబ్లీ తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలవరం యాత్ర నిర్వహించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి 6 అమరావతి బస్సుల్లో సందడిగా ఈ పర్యటన సాగింది.
పశ్చిమగోదావరి జిల్లాలోకి బస్సులు ప్రవేశించగానే విప్‌ చింతమనేని ప్రభాకర్‌ తన స్వగ్రామం దుగ్గిరాలలో అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

బాలకృష్ణా! నీకు పిచ్చే కదా! సర్టిఫికేట్ కూడా ఉందిగా: జగన్ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలుబాలకృష్ణా! నీకు పిచ్చే కదా! సర్టిఫికేట్ కూడా ఉందిగా: జగన్ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

విందు భోజనాలు..

విందు భోజనాలు..

చింతమనేనికి పోటీగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు కొయ్యలగూడెం వద్ద స్వాగత పలికి.. వివిధరకాల తినుబండారాలతో వింధు భోజనం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పట్టిసీమ వెళ్లిన ప్రజాప్రతినిధులకు తమ ప్రాంతంలో పండిన పంట కంకులతో స్థానిక రైతులు ఘనస్వాగతం పలకడం గమనార్హం.

హారతిచ్చిన బాలకృష్ణ, లోకేష్

హారతిచ్చిన బాలకృష్ణ, లోకేష్

గోదావరి నుంచి పంపులద్వారా నీటిని ఏవిధంగా తోడేదీ తెలుసుకున్న నేతలు అక్కడి నుంచి తోడిన నీటిని ఎత్తిపోసే డెలివరీ పాయింట్‌కు వెళ్లి నీటివిడుదలను ఆసక్తిగా తిలకించారు. మంత్రి నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టిసీమ నీటిలో పూలు వేసి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

సంతోషం.. అక్కడ్నుంచి విశాఖకు

సంతోషం.. అక్కడ్నుంచి విశాఖకు

పట్టిసీమ పర్యటన అనంతరం 3గంటల ప్రాంతంలో ప్రజాప్రతినిధులు పోలవరం చేరుకున్నారు. అక్కడ నిర్మాణ పనులు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అసెంబ్లీ తరఫున అందరికీ ఈ తరహా పర్యటన ఏర్పాటు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం పర్యటన ముగియగానే ప్రజాప్రతినిధులంతా అక్కడి నుంచి ఆ బస్సుల్లోనే విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరారు.

English summary
Hindupur MLA Nandamuri Balakrishna went on a visit to Polavaram Project along with other MLAs and MLCs. Speaking on the occasion, Balakrishna said that decades-old dream of constructing Polavaram Project is becoming reality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X