Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పంలో ఓటుకు 5 వేలు పంచిన లోకేష్; టార్గెట్ చేసిన మంత్రి బాలినేని, పిన్నెల్లి విమర్శలు

కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పర్యటిస్తూ డబ్బులు పంచుతున్నాడు అంటూ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలు గుప్పించారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం స్థాయి దిగజారి పోయిందని , కుప్పం లో విజయం సాధించడం కోసం లోకేష్ 5000 రూపాయలు పంచుతున్నారని, ఇలా డబ్బులు పెంచడం సిగ్గుచేటని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

 కుప్పంలో టీడీపీ ఓడిపోతుందన్న మంత్రి బాలినేని

కుప్పంలో టీడీపీ ఓడిపోతుందన్న మంత్రి బాలినేని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతానన్న భయం పట్టుకుందని, అందుకే రకరకాల నీచ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని బాబు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. కుప్పం మునిసిపాలిటీ లోను వైసిపి హవా కొనసాగుతుందన్నారు. టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లలో వైఎస్ఆర్సిపి విజయఢంకా మ్రోగిస్తుంది అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 లోకేష్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

లోకేష్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి


ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారుఅభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.ఇక తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై నిప్పులు చెరిగారు. కుప్పంలో లోకేష్ చేసిన వ్యాఖ్యల పై మండిపడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరని, అలాంటి లోకేష్ సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

ఏపీలో టీడీపీకి టెన్షన్ గా మారిన ఎన్నికలు, ప్రచారంలో లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీకి టెన్షన్ గా మారిన ఎన్నికలు, ప్రచారంలో లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ఈనెల 15వ తేదీన జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు సవాల్ గా మారాయి. గతంలో జరిగిన అన్ని ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీని వైసిపి చిత్తుగా ఓడిస్తే, ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ పరువు కాపాడుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించడమే కాకుండా, వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తుంది. కుప్పంలో ఎన్నికల ప్రచారంలోకి దిగిన నారా లోకేష్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీపై నిప్పులు చెరిగారు. కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్ధంగా లేరని వైసిపి రౌడీయిజానికి బెదిరింపులకు భయపడేవారు కాదని లోకేష్ స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఉప మున్సిపల్ ఎన్నికలు అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినవని, కచ్చితంగా వైసిపికి కుప్పం ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని, నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+