వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తొమ్మిదేళ్లలో: లోకేష్‌కి పడిపోయిన ఎన్నారైలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చొరవతో 250 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఏపీలో స్మార్ట్ విలేజ్, ఆకర్షణీయ వార్డు కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారు.

అమెరికాలో పర్యటిస్తున్న లోకేశ్.. శాన్‌జోస్‌లోని మిల్‌పిటాస్‌ ఐసీసీలో శనివారం ఎన్నారైలతో భేటీ అయ్యారు. రాష్ర్టాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

2022 నాటికి ఏపీని దేశంలో మూడు ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ఆగ్నేయాసియాలో ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అన్నీ ప్రభుత్వం వల్లే సాధ్యం కావని, దాతల సహాయం కావాలని, ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని కోరారు.

Lokesh inspires NRIs to adopt 250 villages

తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ అభివృద్ధిలో చంద్రబాబు ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయని ప్రశంసించారు. లోకేష్ భేటీ వివరాలను టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ విలేకరులకు వెల్లడించారు.

నిజాం రాజులు హైదరాబాదును అభివృద్ధి చేసేందుకు 300 ఏళ్లు, బ్రిటిషన్ వారు సికింద్రాబాదును అభివృద్ధి చేసేందుకు 150 ఏళ్లు తీసుకున్నారని, చంద్రబాబు మాత్రం తన తొమ్మిదేళ్ల పానలో హైదరాబాదును ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశారని పేర్కొన్నారు.

ఆయన దూరదృష్టి వల్లే హైదరాబాదును ప్రపంచ దేశాలు గుర్తించాయని, చంద్రబాబు వల్లే అమెరికాలో తెలుగు వారు ఐటీ రంగాన్ని శాసిస్తున్నారని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలు ప్రవేశ పెట్టామని చెప్పారు.

English summary
Several NRIs have come forward to adopt 250 villages under the Smart Village and Smart Ward programme in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X