మంత్రులతో లోకేష్ భేటీలు: తప్పులేదన్న గంటా
హైదరాబాద్: మంత్రులు, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సమావేశం కావడం పైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. లోకేష్ ప్రభుత్వానికి, పార్టీకి వారధిలా పని చేస్తున్నారని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు.
మంత్రులు కావటానికి ముందు తామంతా తెలుగుదేశం పార్టీ సభ్యులమేనన్నారు. ఇన్సిడెంట్‌గా మేమంతా మంత్రులుగా ఉన్నామని, ప్రభుత్వాన్ని, పార్టీని అనుసంధానం చేసుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
వర్కింగ్ గ్రూపు సభ్యుడిగా లోకేశ్ ప్రజల నుంచి ఎక్కువ సమాచారం సేకరిస్తున్నారని, ఆ అభిప్రాయాలను మా అందరితో పంచుకుంటున్నారని, దానివల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే ముందు ఆ విధివిధానాలపై ముందుగా కసరత్తు చేస్తున్నామని, అంతేకానీ ప్రభుత్వ కార్యకలాపాల్లో లోకేశ్ జోక్యం చేసుకోవటం లేదన్నారు.

రాష్ట్రంలో ప్రతి వార్డు, డివిజన్, గ్రామాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పథకం చేపట్టిందని, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఉన్నతాధికారులంతా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటారని, దీని ద్వారా ఏపీ చిత్రపటాన్ని సమూలంగా మార్చాలన్నదే లక్ష్యమని గంటా చెప్పారు.
అంతేకాని కోట్లాది నిధులు ఆ గ్రామంలో ఖర్చు చేయడం కాదని, పరిశుభ్రమైన, ఆరోగ్యకర, ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మించడమే స్మార్ట్ లక్ష్యమని, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రతి వార్డులోని వారు సూక్ష్మ ప్రణాళికను రూపొందించుకోవాలని, ఈ పథకం విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలన్నారు.
స్మార్ట్ పథకంలో ఉన్న 20 రకాల అంశాలపై సమావేశంలో చర్చించామని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అభిప్రాయ సేకరణకు వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశామన్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలోని అన్ని అంశాలను తక్కువ పెట్టుబడితో ఎలా అమలు చేయవచ్చు.. వాటి సాధ్యాసాధ్యాలపై చర్చించామన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications