వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో డబ్బుతో ఓడించాలని లోకేష్ చెప్పారు : ఫిరాయింపు నేత రామసుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు లోకల్ ఎలక్షన్లను వాయిదా వేయించారంటూ ఫైరయ్యారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచి వివేకాను ఓడించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామసుబ్బారెడ్డి . ఇక తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు సరైన సమయంలో జరిగితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ఐదు వేల కోట్ల నిధులు వస్తాయి. ఆగిపోతే ఆ డబ్బులు పోతాయి కాబట్టి కావాలనే ఇలా చేశారాని విమర్శలు గుప్పించారు.

ఎస్ఈసీకి, సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనా ? సివిల్ సర్వీస్ నిపుణుల్లో చర్చఎస్ఈసీకి, సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనా ? సివిల్ సర్వీస్ నిపుణుల్లో చర్చ

 రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోతే ఎవరిస్తారు ?

రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోతే ఎవరిస్తారు ?

ఇక కేంద్రం నుండి రాకుండా పోతున్న డబ్బులు తిరిగి ఎవరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు . ఎలక్షన్‌ కమిషన్‌ ఒత్తిడికి గురై ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న కాలానికి జరిగితే రాష్ట్రానికి రావలసిన రూ. 5 వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్న ఆయన టీడీపీ నాయకులపై మండిపడ్డారు.

టీడీపీలో విలువలు లేవు .. డబ్బుతో ఎన్నికలు గెలవాలని చెప్పారు

టీడీపీలో విలువలు లేవు .. డబ్బుతో ఎన్నికలు గెలవాలని చెప్పారు

నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిడుతున్న టీడీపీ నాయకులు నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. టీడీపీలో విలువలు లేవని అందుకే పార్టీ వీడానని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి ఎమ్.పిటిసిలను డబ్బుతో కొనాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ తమకు చెప్పారని అన్నారు. కడప జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో ఎమ్.పి.టిసిలు ఉన్నప్పట్టికీ డబ్బుతో ఓటర్లను కొని వివేకాను ఓడించారని రామసుబ్బారెడ్డి వెల్లడించారు.

Recommended Video

AP Cabinet Employees Are On Duty @ New Capital Visakhapatnam
 సీఎం జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు

సీఎం జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు

సీఎం జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే టీడీపీ మీద నమ్మకం లేకనే మంచి నాయకులంతా పోటీ చేయలేదన్నారు. చాలా మంది మంచి నాయకులు లోకల్ ఎలక్షన్లలోకి దిగలేదని... రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తల జీవితాల్లో అయోమయం నెలకొందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. సీఎం జగన్‌ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు కానీ దాన్ని సాకుగా చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

English summary
Former minister Ramasubba reddy, who joined the YCP after saying goodbye to the TDP, is criticizing the Telugu Desam Party. Chandrababu was asked to postpone local elections. He made interesting comments about Kadapa MLC polls and defeating Viveka. Criticized that this was done because the money .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X