జగన్ రెడ్డి గారూ థాంక్స్ అంటున్న నారా లోకేష్.. ఎందుకో తెలుసా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కరెంట్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు పెంచాలంటూ, రాష్ట్రవ్యాప్తంగా పన్నుల భారం భరించలేమంటూ, స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది అంటూ ప్రజలనుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొన్నిచోట్ల మంచినీటి సమస్యలపై, మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాలు అందని తీరుపై, ఇంకొన్ని చోట్ల కల్తీ సారా విక్రయాలపై నిలదీతల పర్వం కొనసాగుతోంది.

దీంతో తెలుగుదేశం పార్టీకి వైసీపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఆయుధంగా మారింది. వైసీపీ నేతలను టార్గెట్ చెయ్యటానికి జగన్ సర్కార్ పరువు తియ్యటానికి పనికొస్తుంది. తాజాగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పై మండిపడిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి బాదుడే బాదుడు తట్టుకోలేని జనం గడప గడపకీ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు నిలదీతలతో దబిడిదిబిడీ వాయిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

lokesh says thanks to ys jagan over the door to door government campaign

వైసీపీ ఎమ్మెల్యేల నిలదీతల పర్వానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ అటు జగన్ కి పరదాలు, ఇటు వైసీపీ ఎమ్మెల్యే లకు బాదుడు అంటూ పేర్కొన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజావ్యతిరేకత ఎంతుందో ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్న లోకేష్ గడప గడపలో ఇదే వాయింపుడు తప్పదని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో సీఎం గారు పరదాలు, వలలు, ముందస్తు అరెస్టులు, దుకాణాలు మూసివేతలుంటేనే బయటకొస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో మీ కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటికీ తెలియజేసినందుకు థాంక్స్ జగన్ రెడ్డి గారు అంటూ లోకేష్ ప్రజా మద్దతు కోసం జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ బూమరాంగ్ అయిందని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ పనితీరుకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూపించి సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+