లోకేష్ వర్సెస్ కాటసాని .. నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీ సంగతి తేలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పెసర వాయి గ్రామంలో ఇద్దరు టిడిపి నేతలను వేట కొడవళ్ళతో నరికి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యల వెనుక పాణ్యం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, టిడిపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు నారా లోకేష్ కర్నూలు పర్యటనతో పాటు టిడిపి నేతలు విమర్శల నేపథ్యంలో లోకేష్ పై కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్
నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని,లేకపోతే ఆయన సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. లోకేష్ కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి లోకేష్ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని, ఒక జోకర్ వంటి వాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో తిట్టాలి అనుకుంటే తాముకూడా నోటికొచ్చినట్లు తిట్టగలమని, కానీ ఆ సంస్కృతి తమకు లేదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

లోకేష్ బఫూన్ కు తక్కువ జోకర్ కి ఎక్కువ
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారని, లోకేష్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని, ట్విట్టర్ లో తప్ప అతనికి మాట్లాడ్డం చేతకాదు అంటూ నిప్పులు చెరిగారు. లోకేష్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ని చూసి లోకేష్ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్న కాటసాని లోకేష్ బఫూన్ కు తక్కువ జోకర్ కి ఎక్కువ అంటూ నిప్పులు చెరిగారు.

జగన్ ను చూసి సంస్కారం నేర్చుకో
రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలు బుద్ధి చెప్తారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వైయస్సార్ హయాంలోనే రాయలసీమకు నీరు అందించామని స్పష్టం చేశారు. శవాలతో రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వైయస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో చూసి లోకేష్ నేర్చుకోవాలని హితవు పలికారు. కాటసాని పులికి పులి బిడ్డ పుట్టిందని, నక్క కు నక్క బిడ్డ పుట్టిందని ఎద్దేవా చేశారు.
Recommended Video

ఈ హత్యలకు మాకు సంబంధం లేదు.. ఏ దర్యాప్తు సంస్థతో అయినా దర్యాప్తు చేయించుకోండి
2004 వైయస్సార్ హయాం నుంచి ఫ్యాక్షన్ కు దూరంగా ఉన్నామని, ఈ జంట హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న కాటసాని దేశంలో ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరుపుకోవచ్చు అంటూ స్పష్టం చేశారు . అదే సమయంలో వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసు దోషులకు అండగా నిలిచింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, దోషులను తప్పకుండా పట్టుకుంటారని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications