రఘురామ అనర్హత పిటీషన్: స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు : చర్యలపై క్లారిటీ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. కొంత కాలంగా రఘురామ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా నడుస్తున్న రాజకీయం ఇప్పుడు ఇద్దరూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. కొంత కాలంగా తాము ఇచ్చిన పిటీషన్ల ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పైన రెండు వర్గాల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ నేతలు ఇప్పటికే పలు మార్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు కలిసారు.

అనర్హత వేయాలంటూ పిటీషన్ తో పాటుగా ఆధారాలను సమర్పించారు. దీని పై పరిశీలన చేస్తామని స్పీకర్ వారితో చెప్పుకొచ్చారు. తాజాగా..పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్ల పైన స్పందించిన స్పీకర్..రఘురామ అనర్హత అంశం పైన మాట్లాడారు. ఈ విషయం పైన నిత్యం మాట్లాడలేమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనర్హత పిటీషన్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉందని వెల్లడించారు. ప్రతీ నిర్ణయం తీసుకొనే ముందు ఒక విధానం ఉంటుందని..అదే ఈ విషయంలోనూ ఫాలో అవుతున్నామని చెప్పుకొచ్చారు.

Loksabha speaker ombirla reaction to Raghurama Rajus disqualification petition filed by YSRCP

ఏ నిర్ణయం తీసుకొనే ముందైనా..ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. కాగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి స్పీకర్‌ను కలిసి..పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్‌ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు దీని పైన స్పీకర్ పరోక్షంగా స్పందించారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్‌.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. ఇక, ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజునే తన పైన జరిగిన దాడి పైన మాట్లాడేందుక అవకాశం ఇవ్వాలంటూ రఘురామ స్పీకర్ ను కోరారు.

అదే విధంగా.. స్పీకర్ పైన ఈ లోగా మరింత గా ఒత్తిడి పెంచేందుకు వైసీపీ సైతం వ్యూహం అమలు చేస్తోంది. ఇక, లోక్ సభ సెక్రటేరియట్ వద్ద రఘురామ పైన అనర్హత పిటీషన్ పరిశీలనలో ఉందని చెప్పటం ద్వారా ముందుగా నోటీసులు ఇవ్వటం జరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సారి పార్లమెంట్ సమావేశాల వేళ..రాష్ట్రానికి సంబంధించిన అంశాలు..ప్రధానంగా తెలంగాణతో నీటి వివాదాలు..స్టీల్ ప్లాంట్ అంశంతో పాటుగా రఘురామ పైన అనర్హత వేటు అంశం సైతం వైసీపీకి కీలకంగా మారుతోంది. ఇద్దరి వాదనలు వింటామని స్పీకర్ చెబుతుండటంతో... ఏం జరుగుతోందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+