కాలువలోకి కారును నడిపించాడు: ఏడుగురు మృతి, డిక్కీలో మహిళ సేఫ్
గుంటూరు: కారు డిక్కీలో కూర్చోవడంతో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద జరిగింది. ఆల్టో కారులో ఆ మహిళకు చెందిన కుటుంబ సభ్యులు ముందు, వెనక సీట్లలో కూర్చున్నారు.
మొగల్ ఆసాబీ అనే 60 ఏళ్ల మహిళ తనకు అక్కడ చోటు లేకపోవడంతో డిక్కీలో కూర్చుంది. భారీ వర్షం పడడంతో డ్రైవర్‌కు దారి కనిపించలేదు. దీంతో కారును నేరుగా గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లోకి నడిపించాడు. కారు ముందు భాగం కాలువలో కూరుకుపోయింది.
అషాబీ కూర్చున్న కారు వెనక భాగం నీళ్లకు పైభాగంలోనే ఉండిపోయింది. దాంతో అషాబీ బతికింది. ఆమె భర్త మొగల్ బాబు ఆర్ఎంపి డాక్టర్. పైల్స్ చికిత్సలో అతను ప్రత్యేకత సాధించాడు. ఆమె ఇద్దరు అల్లుళ్లు ఈ ప్రమాదంలో మరణించారు. వారు కూడా పైల్స్‌ను నయం చేసే ఆర్ఎంపీ వైద్యులే.

కారు కాలువలోకి దూసుకెళ్తుండడాన్ని సిరింగిపాలెం గ్రామస్థుడు మస్తాన్ వలీ చూశాడు. సంఘటనా స్థలానికి వెళ్లి సాయం చేయడానికి ప్రయత్నించాడు. తొలుత అషాబీని బయటకు లాగాడు. మిగతావాళ్లు కారులో ఉన్నారని ఆమె చెప్పడంతో అతను 108కు కాల్ చేశాడు.
అయితే, అప్పటికే ఆలస్యమైంది. ఏడుగురు మరణించారు. అటుగా వెళ్తున్నవారి సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మిగతా మృతులు అషాబీ ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు మనవలూ మనవరాళ్లూ. అషాబీ భర్త కారులో లేరు.












Click it and Unblock the Notifications