వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి నష్టం , బీజేపీతో వైసీపీ రహస్య ఒప్పందం : టీడీపీ ఎంపీ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో ఫెయిల్ అయ్యారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, ఏపీ ప్రత్యేక హోదా అంశంపై, పోలవరం నిధులు వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఏపీకి నష్టం జరిగేలా తమ నిర్ణయాలను వెల్లడించిన కేంద్రంపై వైసిపి ఎంపీలు ఒత్తిడి తీసుకురాలేకపోయారా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, రఘురామకృష్ణంరాజు పై అనర్హత కోసం వైసిపి ఎంపీలు విఫల యత్నం చేశారా? అంటే అవునంటున్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర నాథ్.

ఏపీ ఆర్ధిక పరిస్థితిపై గవర్నర్ కు ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు చేసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ఏపీ ఆర్ధిక పరిస్థితిపై గవర్నర్ కు ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు చేసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్

వైసీపీ ఎంపీలు పోరాడకుండా చేతులెత్తేశారు : టీడీపీ ఎంపీ

వైసీపీ ఎంపీలు పోరాడకుండా చేతులెత్తేశారు : టీడీపీ ఎంపీ

ఈ పార్లమెంటు సమావేశాలలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు పూర్తిగా ఫెయిల్ అయ్యారని ఆయన చెబుతున్నారు. అంతేకాదు బిజెపి వైసిపి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకు ఉదాహరణగా పిఏసి సభ్యుడిగా విజయసాయిరెడ్డిని నియమించడాన్ని ప్రస్తావించారు. పార్లమెంటు సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి ఎంపీలు పోరాడకుండా చేతులెత్తేశారు అని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యల కోసం పోరాడకుండా, ప్రత్యేక హోదాపై గట్టిపట్టు పట్టకుండా వైసీపీ నేతలు గందరగోళం మాత్రమే చేశారని అభిప్రాయపడ్డారు.

నదీజలాల హక్కులు కాలరాసే గెజిట్ పై జగన్, వైసీపీ ఎంపీలు సైలెన్స్

నదీజలాల హక్కులు కాలరాసే గెజిట్ పై జగన్, వైసీపీ ఎంపీలు సైలెన్స్

కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి సరెండర్ అయ్యారని, పార్లమెంటు సమావేశాలలో ఈ వ్యవహారంపై మాట్లాడకపోవడం అందుకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. నదీజలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ పై జగన్ మాట్లాడకపోవడం, వైసిపి ఎంపీలు పార్లమెంటులో దీనిపై ప్రశ్నించకపోవడం అందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలని కనకమేడల రవీంద్ర కుమార్ హితవు పలికారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసిపి లోపాయికారి ఒప్పందం చేసుకుందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ నేతలు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.

మేమంతా ఒకటే అన్న తీరులో వైసీపీ ఎంపీలు .. తూతూ మంత్రంగా ఆందోళనలు

మేమంతా ఒకటే అన్న తీరులో వైసీపీ ఎంపీలు .. తూతూ మంత్రంగా ఆందోళనలు

జగన్ ప్రభుత్వంపై మండిపడిన కనకమేడల రవీంద్ర కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరూ ఎంతో సఖ్యంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వంతో కూడా అదేవిధమైన స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని ఈ పార్లమెంటు సమావేశాలలో స్పష్టంగా చెప్పినట్టుగా ఉందని కనకమేడల ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా నదీజలాల హక్కులను కాలరాస్తూ గెజిట్ జారీ చేసినప్పటికీ దానిపై గట్టిగా పోరాటం చేసిన దాఖలాలు లేవన్నారు.కేవలం రఘురామకృష్ణంరాజు అనర్హత అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించి వైసిపి ఎంపీలు సభలో రచ్చ చేశారని పేర్కొన్నారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు వ్యవహారాల్లో చాలా స్పష్టమైన వైఖరి ప్రదర్శించిందని కానీ వైసిపి నేతలు కేంద్రం ప్రకటించిన అంశాలను విని కూడా పెద్దగా స్పందించలేదని ఆయన ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరంపై కేంద్రం లిఖితపూర్వక సమాధానం

విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరంపై కేంద్రం లిఖితపూర్వక సమాధానం


విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తమ విధానం మార్చుకోమని తేల్చిచెప్పిందని పేర్కొన్న కనకమేడల రవీంద్ర కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని తేల్చి చెప్పిందని, ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసిపి ఎంపీలు విఫలమయ్యారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చాలా కాలంగా కార్మికులు పోరాటం చేస్తున్నా, వారి కోసం కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పి, ఒత్తిడి తెస్తామని చెప్పి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెంచిన అంచనా వ్యయాన్ని పరిగణలోకి తీసుకోమని, గతంలో ఇచ్చిన అంచనా వ్యయం ప్రకారమే చెల్లింపులు చేస్తామని తేల్చిచెప్పింది అని, ఇక ఈ వ్యవహారంలోనూ వైసిపి ఎంపీలు సైలెంట్ గా ఉన్నారని ఎంపీ కనకమేడల పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా విషయాన్ని తేల్చేసిన కేంద్రం .. ఎంపీలు ఏం చేశారు ?

ప్రత్యేక హోదా విషయాన్ని తేల్చేసిన కేంద్రం .. ఎంపీలు ఏం చేశారు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రంపై గట్టిగా పోరాటం చేసింది లేదని, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మూడు అంశాలలోనూ కేంద్రం చాలా స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తున్నా వైసిపి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తమ స్వప్రయోజనాల కోసం, తమపై ఉన్న కేసులను ఎత్తివేయటం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టు పెట్టారని కనకమేడల ఆరోపించారు.

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం : సాయిరెడ్డికి పీఏసీ సభ్యుడిగా ఛాన్స్

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం : సాయిరెడ్డికి పీఏసీ సభ్యుడిగా ఛాన్స్

బీజేపీతో వైసిపి లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆ ఒప్పందం ప్రకారం పీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిని నియమించారని కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బయటకు విభేదిస్తున్నట్లుగా నటిస్తూ, లోపల కేంద్రానికి సహకరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. జగన్ కేంద్రానికి పూర్తిగా లొంగిపోయారని పేర్కొన్న కనకమేడల వైసిపి నేతలు పార్లమెంట్లో ఆందోళన చేసినట్టే చేసి అంతలోనే పలాయనం చిత్తగించారు అని వైసీపీ ఎంపీల తీరుపై విరుచుకుపడ్డారు.

 కేంద్రం ఏపీకి నష్టం చేస్తున్నా బీజేపీ ముందు వైసిపి మోకరిల్లింది

కేంద్రం ఏపీకి నష్టం చేస్తున్నా బీజేపీ ముందు వైసిపి మోకరిల్లింది

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం చేస్తున్న అన్ని విషయాలను రాతపూర్వకంగా వెల్లడించిందని, అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఏపీ సీఎం జగన్, వైసిపి ఎంపీలు వ్యవహరించటం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇక తాజా పరిణామాలతో బీజేపీ ముందు వైసిపి మోకరిల్లింది అని ఖచ్చితంగా అర్థమవుతుందన్నారు టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.

English summary
TDP MP Kanakamedala Ravindra Kumar says YCP MPs have completely failed to bring pressure on the Center in these parliamentary sessions. He also mentioned that there was a faulty agreement between the BJP and the YCP, for example, the appointment of Vijayasaireddy as a PAC member. Kanakamedala fires on ysrcp MPs are not pressurised center on polavaram funds, visakha steel plant privatization issue and also special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X