చంద్రబాబు చిక్కింది అక్కడేనా, వాదనల్లో పస లేదా - ఎక్కడ లోపం..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu) స్కిల్ కేసు ఎదర్కోవాల్సిందేనా. హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయటంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారు. హైకోర్టు(High Court)లో క్వాష్ పిటీషన్ డిస్మిస్ వేళ న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఈ తీర్పు పైన సుప్రీంకు వెళ్తే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అసలు చంద్రబాబు మద్దతు దారులు సాంకేతిక అంశాలే మినహా, ఎక్కడా అసలు ఎందుకు తప్పు చేయలేదని చెప్పటం లేదనే చర్చ సామాన్యుల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు కేసులో వరుసగా : చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా...న్యాయ పరంగా చంద్రబాబు(Chandra Babu) వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చకు దారి తీసింది. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్.. సీఐడీ కేసు పైన టీడీపీ నమ్ముకున్న వారు ప్రధానంగా సాంకేతిక అంశాలనే ప్రస్తావించారనే అభిప్రాయం ఉంది.

ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదనే విధంగా బలమైన వాదనలు జరగలేదనే చర్చ టీడీపీలోనే వినిపిస్తోంది. వైసీపీ(YCP) నేతలు సైతం పదే పదే సాంకేతిక అంశాలే మినహా..తమ నేత తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఏం జరుగుతోంది : ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు(High Court)లో క్వాష్ పిటీషన్ సమయంలోనే టీడీపీ(TDP) మద్దతు దారుల నుంచి ఇవే రకమైన వ్యాఖ్యలు వినిపిపించాయి. పార్టీలోనూ..బయటా చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినదించిన వారు సైతం చంద్రబాబు తప్పు చేయలేదని మాత్రం గట్టిగా ఎక్కడా వాదించిన దాఖలాలు లేవు. రాజకీయ కక్ష్యతో అరెస్ట్ చేసారని ఆరోపణలు..గవర్నర్ అనుమతులు..అవినీతి నిరోధక చట్టం వంటి సాంకేతిక అంశాల చుట్టూనే పార్టీ ముఖ్యులు మాట్లాడటం కనిపించింది.
అసెంబ్లీ(Assembly)లో ప్రభుత్వం చంద్రబాబు స్కిల్ స్కాం పైన తప్పు చేసారని ఆధారాలు చూపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటి వరకు చంద్రబాబు కేసుల గురించి రాద్దాంతం చేసి తమ అధినేత తప్పు లేదని వాదించాల్సిన సమయంలో సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.

బెయిల్ కోసం ప్రయత్నాలు : ఇదే సమయంలో క్వాష్ పిటీషన్ ద్వారా పూర్తిగా కేసు నుంచి బయట పడే ప్రయత్నాలు చేసారు. కానీ, బెయిల్ గురించి ఆలోచన చేయలేదు. బెయిల్ పిటీషన్(bail Petition) ఆలస్యం చేయటం..అదే సమయంలో సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పీటీ వారెంట్ల పైన మాత్రం బెయిల్ కోసం హైకోర్టు(High Court)ను ఆశ్రయించటం పైనా భిన్నాభిప్రాయాలు వినిపించాయి. జైలులో చంద్రబాబును కలిసిన తరువాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు జైలులో దోమలతో కుట్ర చేస్తున్నారు, వేడి నీళ్లు లేవు, ఏసీ ఏర్పాటు చేయలేదు వంటి అంశాల ప్రస్తావనతో అసలు చంద్రబాబు కేసు సీరియస్ నెస్ తగ్గటానికి కారకులుగా నిలిచారనేది మరో అభిప్రాయం.
ఇప్పుడు బెయిల్ కోసం ఏసీబీ కోర్టు(ACB Court)లో పిటీషన్ పైన సోమవారం విచారణ జరగనుంది. ఇప్పటి వరకు ఎన్నో కేసులను న్యాయ పరంగా ఎదుర్కొన్న చంద్రబాబు..ఈ కేసులో మాత్రం అనుకున్నది ఒకటి..అవుతుంది మరొకటి అన్నట్లుగా అనూహ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications