వెంటాడ్డంతో బావిలో పడిన ప్రేమజంట, యువతి మృతి

ఈ క్రమంలో మీనా, చిట్టిబాబు, వారి స్నేహితుడు శివరాజు బైక్ పై పారిపోయేందుకు యత్నించడంతో దీన్ని గుర్తించిన యువతి బంధువులు వారిని వెంబడించారు. దీంతో బైక్ వదిలి పొలాల్లోకి పారిపోతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, చిట్టిబాబు, శివారజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అయితే, యువకులను పోలీసులు అరెస్టు చేశారు. బైక్‌పై పారిపోతన్న సమయంలో అతలాపురం గ్రామ సమీపంలో పడిపోయారు. గ్రామస్థులు వెంటాడుతుండడంతో భయపడి ముగ్గురు కూడా పొలాల్లోకి పారిపోయారు. రాత్రి కావడంతో ప్రమాదవశాత్తు పాడుపడిన బావిలో ముగ్గురూ పడ్డారు. ఈత రావడంతో యువకులు స్వల్ప గాయాలతో బయటకు వచ్చారు. యువతి మాత్రం మరణించింది.
బయటకు వచ్చిన యువకులిద్దరినీ అస్పత్రికి తరలించారు. అయితే, చీకటి కావడంతో యువతి కూడా బావిలో పడిపోయిన విషయం ఎవరూ గుర్తించలేదు. తమ అమ్మాయిని అపహరించడానికి ప్రయత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో యువకులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications