ఆ విషయం తెలిసి!: యువతి ఆత్మహత్యాయత్నం, ఆ వెంటనే అతనూ..

Subscribe to Oneindia Telugu

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని యువతి పురుగుల మందు తాగగా.. ఎక్కడ తనపై కేసు అవుతుందోనన్న భయంతో ఆ యువకుడు కూడా పురుగుల మందు తాగాడు.

వివరాల్లోకి వెళ్తే.. బొర్రంపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి పవన్‌(21), కాకిలేటి కిరణి(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం పవన్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

 love couple suicide attempt in west godavari district

ఈ విషయం ఇటీవలే కిరణకి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కిరణి.. పవన్‌కు ఫోన్‌ చేసి పురుగుల మందు తాగింది. కిరణి ఇచ్చిన సమాచారంతో అక్కడికెళ్లిన పవన్.. ఆమెను ఆ స్థితిలో చూసి షాక్ తిన్నాడు.

కిరణికి ఏమైనా అయితే తనపై కేసు నమోదవుతుందన్న భయంతో తాను కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఇద్దరిని గమనించిన స్థానికులు చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl attempted suicide after hearing his boyfriend married another, there after boyfriend also attempts suicide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X