హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్యాయత్నం: మరొకరితో చనువుగా ఉంటుందనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Attack
హైదరాబాద్: తనను కాదన్నదే పగతో ఓ విద్యార్ధినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది ఘటన మరిచిపోక ముందే హైదరాబాద్‌లో రాజధానిలో మరో ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమిస్తూ, మరో యువకునితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలినే చంపాలనుకున్నాడు. పుట్టిన రోజునాడే ప్రియురాలిపై హత్యాయత్నం చేసాడు. శుభాకాంక్షలు చెబుతూ మూడంతుస్తుల భవనంపైకి తీసుకెళ్లి బలవంతంగా అక్కడి నుంచి కిందికి తోసేశాడు. ఆ యువతి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మంగళవారం సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలిపై దాడి చేసిన యువకుడు పోలీసులకు లొంగిపొయాడు. చిలకలగూడ చింతబావికి చెందిన శ్రీశైలం కుమార్తె రూప (20) పదవతరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. ఐదేళ్ల క్రితం బేగంపేటలోని ఒక శుభకార్యంలో గాజుల రామారం గ్రామానికి చెందిన సాజిత్‌(27)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అయితే రూప మరొక యువకునితో చనువుగా ఉండటం సాజిత్‌ జీర్ణించుకోలేకపోయాడు. మంగళవారం రూప పుట్టినరోజు కావటంతో, సాజిత్‌ కేకుతో ఇంటికి వచ్చాడు. కేక్‌ కట్‌ చేసిన తరువాత రూపను మూడో అంతస్థులోని పెంట్‌హౌస్‌కు తీసుకువెళ్ళి అక్కడనుంచి క్రిందికి తోసేశాడు. భవనాన్ని ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడి క్రింద పడింది. పెద్దగా శబ్దం రావటంతో స్ధానికులు చూసి రూపను సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

యువకుడి వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ జిల్లాలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాలోని వడ్డిచర్లకు చెందిన వంగ విజయలక్ష్మి (23) క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కాలేజిలో ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడిశాల రజనీకర్‌ అనే యువకుడు విజయను తరచూ వేధిస్తుండేవాడు.

నిరాకరించిన విజయను నిత్యం బస్సులో వేధింపులకు, బెదిరింపులకు దిగాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విజయ కుటుంబం పరువుపోతుందనే భయంతో మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే విజయ మృతిచెందింది.

English summary
A boy sajith attempted to kill his lover Roopa at Chilkalaguda in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X