వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదో ప్రేమకథ: జైల్లో ప్రియుడు, తల్లిదండ్రులు పొమ్మన్నారు

మైనారిటీ తీరని ఓ బాలిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆమెను తీసుకుని పారిపోయిన ప్రియుడు జైలు పాలయ్యాడు. తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: మైనారిటీ తీరని ఓ బాలిక ప్రేమలో పడి ప్రియుడితో పారిపోయి చిక్కుల్లో పడింది. పదహారేళ్ల వయస్సు గల బాలిక తాను ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయింది. దాంతో యువకుడిపై తల్లిదండ్రులు పోలీసు స్టేషనలో కిడ్నాప్‌ కేసు పెట్టారు. అతనిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

దాంతో బాలిక ఇంటికి వెళ్లింది. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె నిరాకరించడంతో ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తన ప్రియుడి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఆ అమ్మాయి మైనర్‌ కావడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు మహిళ కమిషన్ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మిని అశ్రయించారు.

తెలంగాణ అమ్మాయి, పాలకొల్లు అబ్బాయిల మధ్య సాగిన ఈ ప్రేమ గురించి కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి బుధవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. పాలకొల్లుకు చెందిన పాకా సందీప్‌ తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే వీధిలో ఉంటున్న పూజ అనే అమ్మాయితో సందీప్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఇద్దరు ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వివాహానికి అభ్యంతరం తెలిపారు.

Lover is in jail and parents thrown away

దాంతో ప్రేమికులిద్దరూ ఎవరికి చెప్పకుండా పాలకొల్లు వచ్చేశారు. పూజ తల్లిదండ్రులు సందీప్‌పై కేసు పెట్టడంతో పోలీసులు పాలకొల్లు వచ్చి వీరిద్దరినీ తీసుకువెళ్లారు. సందీప్‌ను అరెస్ట్‌ చేసి జైలులో పెట్టారు. తల్లిదండ్రులు అమ్మాయికి మరో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని పూజ తేల్చి చెప్పడంతో ఇంటి నుంచి గేంటేశారు. దీంతో ఆమె పాలకొల్లులో ఉంటున్న ప్రియుడి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

అయితే అమెకు మైనార్టీ తీరకపోవడంతో ఏం చేయాలో తెలియని తల్లిదండ్రులు మహిళా సంఘాలను అశ్రయించారు. వీరి సహకారంతో మహిళ కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి వద్దకు చేరుకున్నారు. పూజ విషయాన్ని విన్న సభ్యురాలు తెలంగాణ అధికారులతో ఫోనలో మాట్లాడారు. ఐసీడీఎస్‌ అధికారులతో చర్చించారు.

పూజ మాత్రం మైనారిటీ తీరిన తరువాత సందీప్‌నే చేసుకుంటానని చెప్పడంతో ఆ అమ్మాయిని పాలకొల్లు మహిళా మండలి సంరక్షణలో ఉంచారు. ఆపై ఆమెను హాస్టల్‌లో చేర్చి చదివించాలని నిర్ణయించినట్టు డాక్టర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు.

English summary
Andhra Pradesh Mahila Commission member Rajya lakshmi explained about a love story of a Telangana girl and Andhra boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X