విజయవాడలో దారుణం ..కూతురు జోలికి రావద్దన్న తండ్రిని కూతురి ముందే నరికి చంపిన యువకుడు

కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని కన్న కుమార్తె ఎదురుగానే నడిరోడ్డుపై దారుణంగా నరికి హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడ లో జరిగిన ఈ దారుణం స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. బృందావన్‌ కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే

నాలుగేళ్ళు యువతీయువకుల ప్రేమాయణం
భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ బృందావన్‌ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ అనే యువకుడు విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

lover killed girl friend father before girl friend shocking incident in vijayawada

తండ్రి హెచ్చరికతో ప్రియుడికి దూరంగా
ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను హెచ్చరించి మణికంఠను మరచిపోవాలని చెప్పారు. దీంతో దార్శిని అతడికి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుందామని అతను చెప్పినా తిరస్కరించింది. తన కూతురు నో అన్నా వేధిస్తున్నాడని ఫీల్ అయిన శ్రీరామచంద్రప్రసాద్‌ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. దీంతో మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి.

ప్రియురాలి తండ్రిపై ప్రియుడి దాడి
ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ శ్రీరామచంద్రప్రసాద్‌ వల్లే ఇదంతా జరిగిందని పట్టరాని కోపంతో అతడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపు నుండి రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ ఇంటికి వెళ్తున్న సమయంలో దాడి చేశాడు.

కూతురు ముందే తండ్రిపై కత్తితో దాడి చేసి హత్య
తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు.

కేసు నమోదు
శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+