వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లా వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ ప్రేమజంట రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ ప్రేమజంట రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికంగా మూడవ సంవత్సరం చదువుతున్న తిమ్మసముద్రం కు చెందిన బత్తుల సందీప్(22), ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గుంటూరు జిల్లా మోదుకూరు కు చెందిన మౌనిక(22) లు వారి ప్రేమ ను పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది.

వీరిరువురు చీరాల ఇంజనీరింగ్ కళాశాల లో ఇంజనీరింగ్ చదువుతున్నారు.. కేసు నమోదు చేసుకొన్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications