పెళ్లి చేసుకున్నారు.. కానీ! ఆ ధైర్యం లేక రైలు కింద పడి ఆత్మహత్య..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయితే చేసుకోగలిగారు కానీ పెద్దలు ఏమంటారోనన్న భయం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది.
చీరాల: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయితే చేసుకోగలిగారు కానీ పెద్దలు ఏమంటారోనన్న భయం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది.
వివరాల్లోకి వెళ్తే.. తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24),గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23) చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు.

కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెళ్లితో దగ్గరవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే మంగళవారం విజయవాడలో వివాహం చేసుకున్నారు. అయితే ఇంటికి వెళ్లే ధైర్యం లేక వేటపాలెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
చదువుతో పాటు తమతోను ఎప్పుడూ హుషారుగా ఉండే సందీప్, మౌనిక ఆత్మహత్య చేసుకోవడం తోటి స్నేహితులను విషాదంలో ముంచెత్తింది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications