భర్త, ముగ్గురు పిల్లల తల్లి, ప్రియుడితో ఇలా చేసింది...

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజంపేట: భర్త, ముగ్గురు పిల్లలున్నా ఓ వివాహిత ప్రియుడి మోజులో పడింది. ప్రియుడితో ఆమె కలిసిపారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే ప్రియుడిపై భార్యపై భర్త ఫిర్యాదు చేశారు. అయితే దీంతో ప్రియుడితో కలిసి ఆ వివాహిత ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకొంది.

కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన రాజోలు నాగార్జునరెడ్డి, అదే మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన అమర్‌నాధ్‌రెడ్డి భార్య లక్ష్మీపార్వతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. అయితే శనివారం రాత్రి లక్ష్మీపార్వతి, నాగార్జునరెడ్డి తిరుపతికి వచ్చారు.

lovers commits suicide in Rajampeta

రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొన్నారు. లక్ష్మీపార్వతికి, నాగార్జునరెడ్డితో ఉన్న సంబంధాన్ని ఆమె భర్త ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగార్జునరెడ్డి సౌదీ నుండి ఇటీవల స్వంతగ్రామానికి తిరిగి వచ్చారు.

అయితే కొమ్ములూరులో ఉన్న లక్ష్మీపార్వతితో పరిచయం పెంచుకొన్నాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇంటినుండి పారిపోయేందుకు కూడ సిద్దమయ్యారు.ఈ విషయమై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే తిరుపతికి వెళ్ళిన ఆ జంట ఇంటికి తిరిగి రాలేక రాజంపేట రైల్వేపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడింది.

రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై ఇద్దరు ఆత్మహత్య చేసుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Laxmi Parvati and Nagarjuna reddy were committed suicide near Rajampet railway station on sunday. Nagarjuna Reddy illegal affair with Lakshmi Parvathi from past few months. Lakshmi Parvati's husband complaint against them. both lovers suicide near Rajampeta railwaystation.
Please Wait while comments are loading...