జల్సాలు: ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

విజయవాడ: ప్రియుడితో ప్రేమికుడితో కలిసి జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న యువతిని విజయవాడ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చోరీ చేసి తెచ్చిన సొత్తును విక్రయించిన యువకుడిని కూడా అరెస్టు చేసి 4 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

పాయకాపురం శాంతినగర్‌కు చెందిన దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని సిటీ బస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది.

 Lovers held for theft

వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జల్సా చేసేవారు. గత రెండేళ్లుగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆమె పలుచోట్ల చోరీలకు పాల్పడింది. వీటిలో ఏడు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా సిటీ బస్సుల్లో జరుగుతున్న చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.

మంగళవారం ఓ థియేటర్ వద్ద ఉండగా కృష్ణంరాజు అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు వచ్చిన ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారి దొంగతనం వ్యవహారం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+