ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తోన్నాయి. ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు. దక్షిణ కోస్తా వర్షాల తీవ్రత ఒకింత అధికంగా నమోదవుతోంది.

ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు.

Low Pressure Area Forming Today in Bay of Bengal and to be Cyclonic Storm Possible on October 25

25వ తేదీ నుంచి మూడు రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్ర తీరం చేరే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ప్రత్యేకించి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చు.

భారత ఉపఖండం చుట్టూ భూకంపాలు: నాలుగు దేశాల్లో భూప్రకోపం
భారత ఉపఖండం చుట్టూ భూకంపాలు: నాలుగు దేశాల్లో భూప్రకోపం

శని, ఆదివారాల్లో ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఆ సమయంలో తీరం వెంబడి 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీశైలం ఆలయంలో చురుగ్గా కార్తీకమాసం ఏర్పాట్లు: స్పర్శ దర్శనాలపై.. !!
శ్రీశైలం ఆలయంలో చురుగ్గా కార్తీకమాసం ఏర్పాట్లు: స్పర్శ దర్శనాలపై.. !!

పిడుగులు పడుతున్నప్పుడు గానీ, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+