మరో అల్పపీడనం, అప్రమత్తం కావాల్సిందే - వర్షాల పై తాజా అలర్ట్..!!
వర్షాలు దంచి కొడుతున్నాయి. సాధారణ జన జీవనంపైన ప్రభావం పడుతోంది. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు దంచికొట్టిన వానలు.. నాలుగో రోజు కాస్త తెరిపి ఇచ్చాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ అప్రమత్తం చేసింది.
మరో అల్పపీడనం: సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

భారీ వర్షాలపై అలర్ట్: ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం కొన్ని జిల్లాలో భారీగా, మరికొన్ని జిల్లా ఓ మోస్తరు వర్షాలు కురిశా యి. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా ఉండటంతో గడిచిన 24 గంటల్లో కరీంనగర్, మహబూబ్‌నగర్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాల ధాటికి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకుంది.

హైదరాబాద్ లో అప్రమత్తం: జూలై మాసం మొత్తంగా కురవాల్సిన వాన హైదరాబాద్ లో మూడు రోజుల్లోనే నమోదైంది. నగరంలోని జలాశయాల్లో వరద పోటెత్తుతోంది. మూసీ ప్రవాహం పెరిగింది. ఈ రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో 16 ఈఆర్డీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది.
నీరు నిలిచిన ప్రాంతాలను తొలగించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు సోమవారం నుంచి మరోసారి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ తో యంత్రాంగం అప్రమత్తమైంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications