Lunar eclipse 2023: చంద్రగ్రహణం.. సమయం, సూతకకాలం; జాగ్రత్తలు!!
అక్టోబర్ నెలలో శుక్లపక్షంలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ 28 మరియు అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించనుంది.
చంద్రుడు పాక్షికంగా భూమి యొక్క నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి.

భారతదేశంలో, న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు వారణాసి వంటి కొన్ని ప్రముఖ నగరాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూతక కాలం అక్టోబర్ 28 మధ్యాహ్నం 02:52 గంటలకు ప్రారంభమవుతుంది. సూతక కాలం 02:22 గంటలకు ముగుస్తుంది. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడే వారికి సూతక కాలం 28వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాలుగా చెబుతున్నారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, చంద్రగ్రహణం ఉదయం 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది.స్థానికంగా ఈ గ్రహణం వ్యవధి ఒక గంట పదహారు నిమిషాల 16 సెకండ్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే పెనుంబ్రల్ చంద్ర గ్రహణంగా మాత్రం అక్టోబర్ 28వ తేదీన రాత్రి 11 గంటల 32 నిమిషాలకు ప్రారంభమవుతుందని, మొత్తంగా పెనుంబ్రల్ చంద్రగ్రహణం వ్యవది 4 గంటల 23 నిమిషాల 7 సెకండ్లు గా ఉంటుందని చెబుతున్నారు.
ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. చంద్ర గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టిపరిస్థితులలోనూ ఆహారం తీసుకోకూడదు. ఇంట్లో పనులు చేయకూడదు . పదునైన వస్తువులను దూరంగా ఉండాలి.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications