మోహన్ బాబుతో చిరంజీవి "మా" రాజీ ఫార్ములా : పెదరాయుడు ఘాటు రిప్లై : పవన్ వ్యాఖ్యలపైనా..!!
టాలీవుడ్- ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్..అదే విధంగా "మా" ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభుత్వం తో పాటుగా మోహన్ బాబు పైన వ్యాఖ్యలు చేసారు. దీనికి మోహన్ బాబు సైతం స్పందించారు. అయితే, "మా" ఎన్నికల వివాదంలో మరోసారి ఇప్పుడు ప్రత్యక్షంగా కాకున్నా..పరోక్షంగా చిరంజీవి వర్సస్ మోహన్ బాబు శిబిరాల మధ్య వార్ సాగుతోంది. ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది. మాటలు సవాళ్ల దాకా వెళ్లాయి.

ప్రకాశ్ రాజ్ కు మెగా మద్దతు ఉందంటూ
అయితే, వివాదస్పదంగా మారుతున్న "మా" ఎన్నికల వ్యవహారంలో తొలి నుంచి చిరంజీవి మద్దతు తోనే ప్రకాశ్ రాజ్ బరిలోకి దిగారనే ప్రచారం ఉంది. అదే సమయంలో మంచు విష్ణు కు క్రిష్ణ-బాలక్రిష్ణ-నరేశ్ శిబిరాలు మద్దతిస్తున్నాయి. ఇక, ఈ వ్యవహారం ముదురుతున్న సమయంలో ఒక ఆసక్తి కర అంశం వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా బయట పడిన చిరంజీవి వర్సస్ మోహన్ బాబు వివాదం ఈ మధ్య కాలంలో సమిసిపోయినట్లే కనిపించింది. "మా" క్యాలెండర్ ఆవిష్కరణలో ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. మోహన్ బాబుకు చిరంజీవి వేదిక పైనే ముద్దు పెట్టారు.

చిరంజీవి- మోహన్ బాబు మధ్య రాజీ ఫార్ములా
తరువాతి కాలంలో ఇద్దరూ కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసారు. ఇక, ఇప్పుడు "మా" ఎన్నికల సమయంలో.. ఏం జరిగిందనేది మోహన్ బాబు ఒక టాక్ షో లో వెల్లడించారు. ఆయన నేరుగా స్నేహం గురించి వివరిస్తూ.."మా" ఎన్నికల గురించి మాట్లాడారు.. తనకు ఫోన్ చేసిన మిత్రుడు విష్ణు పోటీలో ఉంటారా అని అడిగారని చిరంజీవి గురించి చెప్పారు. పరోక్షంగా విష్ణు పోటీ లో వద్దనేది ఆయన భావనగా తెలుస్తోంది. అదే చేస్తే..ఇక వివాదం ఉండదంటూ రాజీ ఫార్ములా తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి మోహన్ బాబు సైతం ఘాటుగానే స్పందించారు. మీ పిల్లలు..లేదా నాగబాబు పిల్లలు..లేదా అల్లు అరవింద్ పిల్లలు పోటీ లో ఉంటే..మీ కోసం నేను విష్ణుతో విత్ డ్రా చేయిస్తానని చెప్పానని వివరించారు. అయితే, చిరంజీవి తాను మాట ఇచ్చానని చెప్పగా తాను బాధ పడ్డానన్నారు.

చిరంజీవి ప్రతిపాదన పైన మోహన్ బాబు రియాక్షన్
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మాట ఇచ్చారా... ఎవరికో మాట ఇచ్చానని చెప్పటం కరెక్ట్ కాదని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. స్నేహితుడుగా ఉన్నవాడివి ఇలా చేయటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. తనకు బాధ కలిగించందని చెప్పుకొచ్చారు. దీని కోసం తాను స్నేహం వదులుకోనని చెప్పారు. అన్ని మర్చిపోయి స్నేహాన్ని కోరుకుంటానంటూ మోహన్ బాబు తేల్చి చెప్పారు. కలిసి మెలిసి ఉండటమే తన తత్వంగా మోహన్ బాబు వివరించారు.

అంతర్గతంగా ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే
అయితే, ప్రకాశ్ రాజ్ కు తొలుత మద్దతుగా నిలిచి..ఆ తరువాత బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు .. చేసి ఆ తరువాత తన శ్రేయోభిలాషులు చెప్పటంతో పోటీ నుంచి తప్పుకుంటుంటన్నానంటూ బండ్ల గణేష్ పోటీ నుంచి విత్ డ్రా అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సందేశం కారణంగానే బండ్ల గణేష్ తప్పుకున్నారనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. ఇక, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మోహన్ బాబు బంధువంటూ పవన్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక నుంచి కొన్ని కామెంట్లు చేసారు.

పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ రెడీ
ఆన్ లైన్ టిక్కెట్లు తీసుకొచ్చిన ప్రభుత్వం..రేపు మోహన్ బాబు విద్యా సంస్థల్లోనూ ఆన్ లైన్ ద్వారానే ఫీజులు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. జగన్ కు మీరైనా చెప్పాలంటూ మోహన్ బాబుకు సూచించారు. దీనికి స్పందించిన మోహన్ బాబు..మెల్లగా లాగావు అంటూనే...ముందుగా విష్ణుకు ఓటు వేసి గెలిపించాలని..11వ తేదీన తాను స్పందిస్తాంటూ సమాధానం ఇచ్చారు. ఇక, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ను గెలిపించుకోవటం అటు మెగా క్యాంప్ కు... ఇటు విష్ణు గెలుపు మోహన్ బాబు కు ఒక విధంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.
Recommended Video

ముదురుతున్న స్టార్ వార్
ఇక. "మా" ఎన్నికల పేరుతో జరుగుతున్న పరిణామాల పైన మోహన్ బాబు అసహనం వ్యక్తం చేసారు. అయినా.. తన కుమారుడు విజయం ఖాయమంటూ మరోర ఇంటర్వ్యూ లో గట్టిగా చెబుతున్నారు. అయితే, "మా" ఎన్నికల పేరుతో మూవీ ఇండస్ట్రీలో ఒక్కొక్కటిగా బయట పడుతున్న వివాదాలు... ఎన్నికల ఫలితాల తరువాత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు తరువాత పెద్దలు ఎవరూ లేరంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు అటు మూవీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications