వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగబాబు-ప్రకాశ్ రాజ్ రాజీనామాలు తిరస్కరణ : పవన్ కీలక సూచన- సీఎం జగన్ ను కలుస్తా : మంచు విష్ణు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏ పోటీ జరిగినా.. గెలుపు - ఓటములు సహజమని..ఈ సారి తాము గెలిస్తే..వచ్చే సారి మరొకరు గెలవచ్చని "మా" నూతన అధ్యక్షుడు విష్ణు వ్యాఖ్యానించారు. గేమ్‌ ఆడిన వారికంటే చూసిన వారికే ఎక్కువ ఎగ్జైట్‌మెంట్‌ ఉందని అర్థం అవుతుందని మంచు విష్ణు అన్నారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలో తన ప్యానల్‌ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి తమ గెలుపును సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఈ సారి వాళ్లు గెలవలేదు. ఐ విష్‌ బెటర్‌ లక్‌ నెక్ట్‌టైం అని వ్యాఖ్యానించారు. తమ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే "మా" నూతన కార్యవర్గ సమావేశం జరిగిందన్నారు.

ఆ ఇద్దరి రాజీనామాల తిరస్కరణ

ఆ ఇద్దరి రాజీనామాల తిరస్కరణ

ఆ సమావేశంలో నాగబాబు..ప్రకాశ్ రాజ్ రాజీనామాలను తిరస్కరించినట్లుగా వెల్లడించారు. చిరంజీవి తన తండ్రి మోహన్ బాబుకు ఫోన్ చేసారని..ఏం మాట్లాడారో వాళ్లనే అడగాలని సూచించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారి రాజీనామాల్లో కేవలం ప్రభాకర్ ది మాత్రమే తమకు మెయిల్ ద్వారా వచ్చిందని..తమకు రాజీనామా లేఖలు చేరితే వాటి పైన కార్యవర్గ సమావేశంలో చర్చించి..పెద్దల సలహాల మేరకు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. అలయ్ బలయ్ లో తాను పవన్ కళ్యాన్ ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ సూచనలు చేసారు

పవన్ కళ్యాణ్ సూచనలు చేసారు

స్టేజ్ ఎక్కేముందే తాము చాలా అంశాల పైన చర్చించామని వివరించారు. పవన్ కళ్యాణ్ తనతో "మా" మన అమ్మ లాంటిదని..కాపాడుకోవాలంటూ సూచించారని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ పోలింగ్ జరిగిన తీరు పైన సీసీటీవీ ఫుటేజ్ కోరుతున్నారని...ప్రకాశ్‌ రాజ్‌ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చని వ్యాఖ్యానించారు. తా ము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచామన్నారు. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చని చెప్పారు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదని వెల్లడించారు.

ప్రకాశ్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ చూసుకోవచ్చు

ఎన్నికల్లో గెలిచిన అందరూ కలిసి పని చేయాలనే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేసారు. ఎన్నికల రోజు రాత్రి జరిగిన పోలింగ్ అందరి సమక్షంలోనే జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ తాను .. ప్రకాశ్ రాజ్ ఇద్దరమే ఓపెన్ చేసి లెక్కించామని చెప్పారు. ఎన్నికల అధికారులు ఇంకా కౌంటింగ్ పూర్తి చేయకుండానే...అధికారికంగా ప్రకటించకుండానే తన గెలుపు ఖాయమైందంటూ తనకు ప్రకాశ్ రాజ్ అభినందించారని విష్ణు వివరించారు. మరుసటి రోజుకు అనుకున్న ఫలితాలకు తేడా ఏమీ రాలేదన్నారు.

నాన్నకు చిరంజీవి ఫోన్ చేసారు

నాన్నకు చిరంజీవి ఫోన్ చేసారు

తమ ప్యానల్ నుంచి పోటీ చేసిన పృథ్వీ కేవలం ఏడు ఓట్ల తేడాతో ఓడిపోవటం బాధ కలిగించిందని చెప్పారు. ఇక, ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో విష్ణు తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఆన్ లైన్ టిక్కెట్ల నిర్ణయం తాను సమర్ధిస్తున్నట్లుగా స్పష్టం చేసారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలుస్తామని విష్ణు వెల్లడించారు. అదే విధంగా తెలుగు ఫిలం ఛాంబర్ నేతలతో తాను త్వరలో సమావేశం కానున్నారని... ఏపీ ప్రభుత్వం తో జరుగుతున్న చర్చల గురించి తెలుసుకుంటానని చెప్పారు. ఇక, "మా" బైలాస్ మార్పులు కొన్ని ఉంటాయని స్పష్టం చేసారు. అయితే, ఏవి అవసరమో అవే చేస్తామని విష్ణు తేల్చి చెప్పారు.

English summary
Prakash Raj and Nagababu resignations as MAA membershios have been rejected by President Vishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X