3 ఏళ్లలో రూ.1లక్షకు రూ.13 లక్షల లాభం ఇచ్చిన స్టాక్
ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ తీవ్ర ఒడుదొడుకులకు లోనువుతుంటాయి. అటువంటివాటిల్లో పెట్టుబడి పెట్టి లాభం అందుకోవాలంటే అంత సులువైన విషయమేం కాదు. చాలామందిని చాలా తక్కువ సమయంలోనే మిలియనీర్లను చేసిన సందర్భాలున్నాయి. అటువంటి ఓ స్టాక్ గురించి తెలుసుకుందాం. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే 1350 శాతం రిటర్న్స్ అందించింది. మూడు సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టివుంటే ఇప్పుడు వాటి విలువ రూ.13 లక్షలుగా ఉండేది.
మాన్ అల్యూమినియం కంపెనీ (Maan Aluminium). పెట్టుబడిదారులకు ఏడాదిలోనే ఏకంగా 181 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తాజాగా కంపెనీ మరో ప్రకటన చేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.5 చొప్పున 1:2గా విభజించడంతోపాటు బోనస్ కూడా ప్రకటించింది. ఒక షేరుకు మరో షేరును బోనస్ గా ఇస్తోంది. దీనిద్వారా లిక్విడిటీ పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఏడాదిలో 181 శాతం రిటర్న్స్ ఇవ్వగా గడిచిన మూడు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే ఏకంగా 1350 శాతం పెరిగింది. కంపెనీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈనెల 9వ తేదీన ట్రేడింగ్ రోజు 1.60 శాతం పెరిగి రూ.322.90 దగ్గర నిలిచింది. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.327ను కూడా తాకింది. మాన్ అల్యూమినియం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.436.60 కోట్లు కాగా సంవత్సరం క్రితం రూ.లక్ష పెట్టుబడిగా పెట్టినవారికి మూడింతలు పెరిగింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 127 శాతం నెట్ ప్రాఫిట్ పెరిగింది. అది రూ.50 కోట్లకు చేరింది. గత ఏడాదిలో రూ.22 కోట్లుగా ఉండేది. మనదేశంలో అల్యూమినియం ఉత్పత్తి చేసే కంపెనీల్లో మాన్ అల్యూమినియం కూడా ఒకటి. కన్ స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఆటోమేషన్, ఎయిర్ కండిషనింగ్ వంటి పరిశ్రమలకు ఈ కంపెనీ అల్యూమినియం ఉత్పత్తులను అందిస్తోంది.












Click it and Unblock the Notifications