నా వెంట్రుక కూడా పీకలేరన్న వైసీపీ ఎమ్మెల్యే!!

ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయం ఒక ఎత్తయితే, పౌరుషానికి మారుపేరైన పల్నాడు రాజకీయం మరోలా ఉంటుంది. ఇక్కడి రాజకీయ వాతావరణం ఎప్పడూ మండే సూర్యుడిలా ఉంటుంది. ఒక్కొక్క నేత నుంచి ఒక్కొక్క డైలాగు బయటకు వస్తుందే వాతావరణం కూడా అలాగే వేడెక్కుతూ వస్తోంది. మాచర్లలో పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఓడిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు శపథం చేశారు. దీనిపై పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. 100 మందిని ఒకేసారి రావాలని.. అందరూ కలిసి రావాలని సవాల్ విసిరారు.

'బ్రహ్మానందం రెడ్డి వచ్చినా, మధుబాబు వచ్చినా, చలమా రెడ్డి వచ్చినా.. అంజి రెడ్డి వచ్చినా.. మీరంతా కలిసి వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెరుగుతుందేకానీ తగ్గదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పల్నాడులో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే ఇంత ఘాటుగా మాట్లాడటమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

If the entire politics of Andhra Pradesh is one height, the politics of Palnadu, nicknamed for manhood, is another.

గతంలోనూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస రావుకు సవాల్ విసిరారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఇంటికొచ్చి తంతాం అని హెచ్చరించారు. అప్పుడు యరపతినేని వైపు నుంచి కూడా ఘాటుగా స్పందనలు వచ్చాయి. తాజాగా పిన్నెల్లి ఇచ్చిన హెచ్చరికపై తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుందా? అని చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+