అర్ధరాత్రి 12 గంటలకు పల్నాడులో పిన్నెల్లి రీఎంట్రీ..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడం, ప్రత్యర్దులపై నేరుగా దాడులకు దిగడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చింది. పిన్నెల్లికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పల్నాడులో రీఎంట్రీ ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.
పిన్నెల్లిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో గతంలోనే ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. నిన్న పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యవహారంలో నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కు కొన్ని షరతులు కూడా విధించింది. ఇందులో ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరై సంతకం చేయాలనే షరతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు రెండు వారాల తర్వాత పల్నాడులో రీఎంట్రీ ఇచ్చారు.

హైకోర్టు ముందస్తు బెయిల్, షరతుల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడుకు తిరిగి వస్తారనే సమాచారంతో నిన్న సాయంత్రం నుంచే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ ఆఫీసుకు వచ్చారు.
పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి#PinnelliRamakrishnaReddy #Macharla #YSRCPMLA #Oneindiatelugu pic.twitter.com/w3k52rdWRj
— oneindiatelugu (@oneindiatelugu) May 29, 2024
పిన్నెల్లి వస్తున్నారన్న సమాచారంతో తన అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకుని ఎస్పీ మలికా గార్గ్ ఎదురుచూశారు. అయితే అర్ధరాత్రి 12 గంటలకు పిన్నెల్లి వచ్చి సంతకం చేసి వెళ్లారు. మరో 5 రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన నేతలతో భేటీ అయి ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications