పేర్ని నానికి బిగ్ షాక్ ..! అరెస్టు వారెంట్ జారీ..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన్ను పలు కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై ఆరెస్టు వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
బందరు మాజీ ఎమ్మెల్యే అయిన పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనే టీడీపీ కార్యకర్తపై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్న పేర్నినాని హాజరు కావడం లేదు. దీంతో పలుమార్లు వేచి చూసిన కోర్టు.. ఇవాళ పేర్నినానిపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరు పర్చబోతున్నారు.

2019లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరిగినా సాక్షిగా ఉన్న పేర్ని నాని హాజరు కాకపోవడంతో అవి కాస్తా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. దీంతో తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ చేసి రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన్ను తదుపరి విచారణకు హాజరు పర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో కాకుండా తాను సాక్షిగా ఉన్న కేసులో పేర్నినానిపై ఇలా వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications