వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క‌డుపులో బిడ్డకు క‌ష్టం.. బ‌య‌ట త‌ల్లికి క‌ష్టం... ఇదీ.. క‌ష్టాల‌(మ‌చిలీ)ప‌ట్నం ఆసుప‌త్రి తీరు!!

|
Google Oneindia TeluguNews

క‌డుపులో బిడ్డ కాళ్ల‌తో తంతుంటే ఆనంద‌ప‌డిపోవాల్సిన త‌ల్లి ఆవేద‌న చెందుతోంది. అమ్మా అని పిలిపించుకోవ‌డానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్న త‌ల్లికి ''లేవు.. ఇప్పుడు కాదు.. త‌ర్వాత రండి'' అనే మాట‌లే క‌ర్ణ‌క‌ఠోరంగా విన‌ప‌డుతున్నాయి. మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చికిత్స కోసం వ‌చ్చే గ‌ర్భిణీల ఆవేద‌న మాట‌ల‌కంద‌నిది. కడుపులో బిడ్డ ఎలావున్నాడు అని తెలుసుకోవడానికి, చికిత్సందించడానికి ముఖ్య‌మైంది స్కానింగ్. ఆ స్కానింగ్ ను ఆసుప‌త్రి యాజ‌మాన్యం నిలిపివేసింది. ఇన్ పేషెంట్ల‌కు మాత్ర‌మే ఈ సేవ‌లు అందుతున్నాయి. ఔట్ పేషెంట్లకు కావాలంటే రాజకీయ నాయకుల నుంచి సిఫార్సు లేఖ‌లు తీసుకురావాలి. అలా తెచ్చినవారికి వైద్యులు, సిబ్బంది పెద్ద‌పీట వేస్తున్నారు. బిడ్డ లోప‌ల ఎలావున్నాడో అని తెలుసుకోవ‌డానికి చేసే స్కానింగ్ కోసం రోజుల త‌ర‌బ‌డి ఆసుపత్రి ఎదుట ఎదురుచూడాల్సిన దుస్థితిలో గర్భిణీలున్నారు.

మూలనపడ్డ స్కానింగ్ పరికరాలు


మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్క సిటీ నుంచే కాకుండా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్య‌లో రోగులు వ‌స్తుంటారు. వారిలో అధిక శాతం గ‌ర్భిణీలే ఉంటారు. ఇక్కడి ప్రభుత్వాస్ప‌త్రిలో రోగుల కోసం కొన్ని సౌక‌ర్యాల‌ను అమ‌ర్చిన‌ప్ప‌టికీ ముఖ్య‌మైన స్కానింగ్ విభాగంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. మూల‌న‌ప‌డిన స్కానింగ్ ప‌రిక‌రాలు, ప‌నిచేయ‌న‌వే కనపడుతుంటాయి.

 నాలుగేళ్లైనా ఎటువంటి మార్పు లేదు

నాలుగేళ్లైనా ఎటువంటి మార్పు లేదు


నాలుగు సంవత్సరాల క్రితం తన మొదటి బిడ్డకు కాన్పు కోసం మ‌చిలీప్న‌టం ఆసుప‌త్రికి వ‌చ్చాన‌ని, త‌ర్వాత రెండోకాన్పు కోసం ఇప్పుడు మ‌ళ్లీ వ‌చ్చాన‌ని, అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎటువంటి మార్పు లేద‌ని, స్కానింగ్ కేంద్రంవ‌ద్ద గ‌ర్భిణీలు ఇప్ప‌టికీ గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నార‌ని చ‌ల్ల‌ప‌ల్లికి చెందిన ఓ మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తంచేసింది. ఆసుపత్రి సామర్ధ్యానికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలం చెందారని, గతంలోనే గర్బిణి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

Recommended Video

Gold Rates 1947 నాటి బంగారం రేట్లు చూస్తే షాకే *India | Telugu OneIndia
గట్టిగా అడుగుతుంటే తలుపులు మూసుస్తున్నారు

గట్టిగా అడుగుతుంటే తలుపులు మూసుస్తున్నారు

గట్టిగా అడుగుతుంటే తలుపులు మూసేస్తున్నారు
స్కానింగ్ చేస్తాం రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారని, వచ్చిన తరువాత గంటలు తరబడి కూర్చోబెట్టిన తర్వాత స్కానింగ్ చేయవలసిన డాక్టర్ కు కొవిడ్ వచ్చి సెలవు పెట్టారని చెపుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. కొవిడ్ వచ్చి సెలవు పెట్టిన డాక్టర్ ఇన్ పేషెంట్లకు ఎలా స్కానింగ్ చేస్తున్నారని? నిలదీస్తున్నారు. గట్టిగా అడుగుతుంటే తలుపులు మూసేస్తున్నరాని, తమ గోడును ఉన్నతాధికారులు పట్టించుకొని సమస్య పరిష్కరించాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

English summary
There are pregnant women who have to wait in front of the machilipatnam hospital for days for a scan to find out how the baby is doing inside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X