Balashowry:ఆపదలో ఆప్తుడిలా..అభివృద్ధికి దిక్సూచిగా, బాలశౌరి 100డేస్..!

ఎంపీ బాలశౌరి ఈ పేరు జనసేన పార్టీలో ఓ సంచలనం. ఎందుకంటే? మచిలీపట్నం పార్లమెంట్‌ను అభివృద్ది పథంలో నడిపిస్తున్న తీరు, లోక్‌సభలో తన పార్లమెంట్‌లోని సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచి వాటి అహర్నిశలు కష్టపడుతున్న ఎంపీగా మంచి పేరు గడిస్తున్నారు. నిత్యం ఏదొక మంచి పని ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఎంపీ బాలశౌరి పేరు తెచ్చుకున్నారు. మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ.. కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్నారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఎంపీగా మూడోసారి గెలుపొంది 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ మూడు నెలల కాలంలోనే ఎంపీ బాలశౌరి అనేక అభివృద్ది కార్యక్రమాలకు నాంది పలకడం విశేషం.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నూతన విమాన సర్వీసులు..

అమరావతి రాజధాని పరిధిలో ఉన్న గన్నవరం విమానాశ్రయం గత అయిదేళ్లుగా ఎలాంటి అభివృద్ది నోచుకోలేదు. దీంతో అనేక విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ బాలశౌరి గన్నవరం విమనాశ్రయం అభివృద్దికి చర్యలు చేపట్టారు. ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉన్న గన్నవరం నుంచి ముంబయికి విమాన సర్వీసును ఎంపీ బాలశౌరి చొరవతో తీసుకొచ్చారు. ఈ విమాన సర్వీసు రాకతో అమరావతి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కనెక్టింగ్‌ ఫ్లైట్‌గా ఉపయోగపడుతోంది. అంతేకాకుండా ఇటీవలే ముంబయి నగరానికి మరో సర్వీసు, ఢిల్లీకి ఇంకో సర్వీసును ఏర్పాటు చేశారు. త్వరలో గన్నవరం నుంచే దుబాయ్‌కు ఫ్లైట్‌ సర్వీసు తీసుకురావాలని ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని కోరగా... ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ఎయిర్‌పోర్టులో జరుగుతున్న నూతన టెర్మినల్‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పనుల వేగవంతానికి ఎంపీ బాలశౌరి కృషి చేస్తున్నారు.

bala showry meets PM Modi

విపత్తుల్లో స్పందిస్తూ..

అకాల వర్షాలు, వరదలతో ఇటీవల ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ పరిస్థితులపై అందరికంటే ముందుగా స్పందించి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్లకు లేఖలు రాశారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. గతంలో బీహార్‌ రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో దేశంలోని ఎంపీలు అందరూ ఆదుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, అందరు ఎంపీలు వారి నిధులు కేటాయించాలని కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల వచ్చిన కేంద్ర విపత్తుల ఇంటర్‌ మినిష్ట్రల్‌ సెంట్రల్‌ సభ్యులతో ఎంపీ బాలశౌరి సమావేశమై.. వరదల వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయని ఎంపీ వివరించారు. కృష్ణా నది, బుడమేరు వరదల వల్ల అనేక మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయని, కొందరి ఇళ్లు పూర్తిగా నీటమునిగాయని అన్నారు. వరదల సమయంలో ముంపు ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎంపీ బాలశౌరి. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐవోసీఎల్‌ ద్వారా దాదాపు రూ.15 లక్షలు నిధులు తీసుకొచ్చి 500 కుటుంబాలకు నిత్యావసర సరకులు, వంటసామాగ్రి అందజేశారు.

పార్లమెంట్‌లో గళమెత్తి.. సమస్యలను వివరించి..

మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రసంగించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను కలిసి లేఖలు అందజేశారు. ఇంటింటికీ తాగునీరు అందించాలని జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు కృష్ణా జిల్లాకు సంబంధించి రూ.1000 కోట్లు కేటాయించాలని ఎంపీ కోరారు. దివిసీమ ప్రజల చిరకాలకోరిక మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సంబంధిత మంత్రిని కలిసి లేఖలను అందజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మచిలీపట్నంలో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్‌ ఆడిటోరియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.

Balashowry

కేంద్ర మంత్రులకు లేఖలు..

మచిలీపట్నం పోర్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో పోర్ట్ నుంచి రాకపోకలకు వీలుండేలా రహదారుల నిర్మించాలని ఎంపీ బాలశౌరి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. ఈ మేరకు మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణంపై మూడు లేఖలను మంత్రికి అందజేశారు. పోర్టు అనుసంధానంగా రెండు జాతీయ రహదారులు, పెడన - గుడివాడ మధ్య జాతీయ రహదారిని నాలుగు లైన్లను విస్తరించాలని ఎంపీ బాలశౌరి కోరారు. ప్రధానంగా పెడన నుంచి గుడివాడ వెళ్లే 216 జాతీయ రహదారి ప్రస్తుతం రెండు వరుసల రోడ్డు ఉండగా.. ప్రస్తుతం, రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పెడన - గుడివాడ రోడ్డును నాలుగు వరుసలకు పెంచాలని ఎంపీ తెలిపారు. అదేవిధంగా పోర్టుకు అనుసంధానంగా పెడన బైపాస్‌కు కలిపేలా సుమారు 4 కి.మీ వరకు నాలుగు వరసల రోడ్డును నిర్మించాలని ఎంపీ బాలశౌరి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీ బాలశౌరి అందజేసిన లేఖపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

మురుగు సమస్యకు చెక్‌...

ఎన్నో ఏళ్లుగా బందరును పట్టిపీడిస్తున్న మురుగు సమస్యను పరిష్కరించే విధంగా ఎంపీ బాలశౌరి చర్యలు తీసుకుంటున్నారు. బందరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణంపై అధ్యయనానికి కేంద్ర నుంచి అధికారులను పిలిపించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటుపై కేంద్ర బృందం పలు వివరాలు సేకరించి కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టిలో ఉంచింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎంపీ బాలశౌరి మరోసారి ప్రత్యేక శ్రద్ద తీసుకుని అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. ఈ లైన్‌ కూడా నిర్మిస్తే దివిసీమ ప్రజల చిరకాలకోరిక ''మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్‌'' సాకారం అవుతుందని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+