Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మచిలీపట్నం-NH-65.. గ్రీన్ ఫీల్డ్ హైవే.. కేంద్రం గుడ్ న్యూస్..

మచిలీపట్నం పోర్టును NH-65, NH-216 జంక్షన్‌ తో అనుసంధానించేలా, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్‌ టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 573.77 కోట్ల కేటాయింపులకు తాజాగా ఆమోద ముద్ర లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది.

విజయవాడ- మచిలీపట్నం పోర్టు జాతీయ రహదారి-65 (NH65) ఆరు వరుసలుగా విస్తరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఆరు లేన్లుగా మార్చేందుకు కేటాయించిన రూ. 573.77 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోస్టు చేశారు.

" మచిలీపట్నం పోర్టును NH-65, NH-216 జంక్షన్‌ తో అనుసంధానించేలా, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్‌ టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 573.77 కోట్ల కేటాయింపును ఆమోదించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్టుకు, జాతీయ రహదారి కారిడార్‌ కు మధ్య నేరుగా అంతరాయం లేని రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనివల్ల సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గి, లాజిస్టిక్స్ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 6-లేన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు మరియు ఒక ఓవర్‌పాస్-కమ్-రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB) నిర్మించనున్నారు" అని నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఇక ఈ 6 లేన్ల రహదారి ద్వారా భారీ కంటైనర్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల వల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరుకు రవాణా సాగుతుంది. అలాగే ఈ అనుసంధానం ద్వారా మచిలీపట్నం ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.

MachilipatnamPort Connectivity Soars the amount of 573 Cr Approved for 6-Lane Greenfield Highway

మరోవైపు విజయవాడ బైపాస్ రోడ్డుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పారు. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల రోడ్డు మార్చి 31 నాటికి పూర్తవుతుందన్నారు. రూ.1,194.59 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+