విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Madanapalle double murders case: మెంటల్ ఆస్పత్రి నుండి మదనపల్లె సబ్ జైలుకు దంపతుల తరలింపు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, అందర్నీ షాక్ కు గురి చేసిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన కుమార్తెల జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం నాయుడు ,పద్మజ లను విశాఖపట్నం మానసిక వైద్యశాల నుండి నిన్న డిశ్చార్జ్ చేశారు . మదనపల్లె జంట హత్యల కేసులో మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను చంపుకున్న మదనపల్లె జంట హత్యల కేసులో భార్యాభర్తలిద్దరూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని వైద్యులు నిర్ధారించి, వారిని విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే .

రోడ్డు మార్గంలో పురుషోత్తం నాయుడు , పద్మజలను మదనపల్లె సబ్ జైలుకు తరలింపు

రోడ్డు మార్గంలో పురుషోత్తం నాయుడు , పద్మజలను మదనపల్లె సబ్ జైలుకు తరలింపు


నిన్న కుమార్తెల జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం నాయుడు, పద్మజ లను విశాఖ మెంటల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడంతో వారిని చిత్తూరు పోలీసులు విశాఖపట్నం నుండి రోడ్డు మార్గంలో మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. జంట హత్యల కేసు నిందితులు పురుషోత్తం నాయుడు పద్మజ లను విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో పోలీసుల బందోబస్తు మధ్య మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

సైలెంట్ గా జైల్లోకి వెళ్ళిన దంపతులు

సైలెంట్ గా జైల్లోకి వెళ్ళిన దంపతులు

మదనపల్లె సబ్ జైలుకు వెళ్లిన పురుషోత్తం నాయుడు పద్మజ ఎలాంటి హంగామా సృష్టించకుండా సైలెంట్ గా పోలీసు వాహనాన్ని దిగి సబ్ జైల్లో కి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం జనవరి 24వ తేదీన మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు మూఢ భక్తితో తమ ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చారు. అలేఖ్య , సాయి దివ్య లను హతమార్చి వారు తిరిగి బ్రతికి వస్తారని, శివుడు బ్రతికిస్తాడు అని నానా హంగామా చేశారు.

విశాఖ మెంటల్ హాస్పిటల్ లో వారికి చికిత్స

విశాఖ మెంటల్ హాస్పిటల్ లో వారికి చికిత్స

తల్లి పద్మజ తానే శివుడిని, తానే కరోనాను భూమ్మీదికి పంపానని ఇలా రకరకాలుగా పిచ్చిగా ప్రవర్తించారు. వారిద్దరిని విచారించిన పోలీసులు, వారిరువురిని పరిశీలించిన డాక్టర్లు వారి మెంటల్ కండిషన్ సరిగా లేదని చెప్పడంతో వారిని విశాఖలోని మెంటల్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఇన్ని రోజుల పాటు చికిత్స పొందిన వారు కోల్పోవడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు. దీంతో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని జైలుకు తరలించారు.

పాశ్చాత్తాపంలో మదనపల్లె దంపతుల జంట

పాశ్చాత్తాపంలో మదనపల్లె దంపతుల జంట

దీంతో చిత్తూరు జిల్లా పోలీసులు వారి మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో వారిని తిరిగి మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం భార్యాభర్తలు ఇరువురూ పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు గా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇద్దరి మానసిక పరిస్థితి మెరుగు పడిన కారణంగా అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగనున్నారు.

English summary
Purushottam Naidu and Padmaja, accused in the case of twin murders of their daughters, were discharged from Visakhapatnam Mental Hospital yesterday and were shifted by road from Visakhapatnam to Madanapalle sub-jail by the Chittoor police in a special vehicle amid police security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X