తేజ్ సామాన్యుడు కాదు, కలెక్టర్ ఆఫీసులో దందాలు, పెద్దిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె విడిపోయి అన్నమయ్య జిల్లాలో భాగం అయ్యింది. బారతదేశంలోని అతి పెద్ద డివిజన్ గా మదనపల్లెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి, స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మదనపల్లెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అలాంటి మదనపల్లె ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రికిరాత్రే ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులు కాలి బూడిద అయిపోయాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టరు కార్యాలయంలో 22-ఏ సెక్షన్‌లో రికార్డులను ఉద్దేశపూర్వకంగా కాల్చారని ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో నిర్ధారించిన ఘటనలో ఈ కేసులో నిందితుడైన గౌతమ్‌ తేజ్‌ అలియాస్ గౌతమ్ అలియాస్ తేజ్ కెరీరంతా అవినీతిమయమే అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆ సెక్షన్‌ క్లర్కు అయిన గౌతమ్ తేజ్ కారుణ్య నియామకం ద్వారా చిత్తూరు కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు.

Madanapalle sub collector office employee Gautham Tej is being pulled out by the police

తరువాత అదే చిత్తూరు జిల్లా కారుణ్య నియామక విభాగానికి ఇన్‌ఛార్జిగా గౌతమ్ తేజ్ పనిచేశాడు. ఉద్యోగంలో చేరినప్పంటి నుంచి గౌతమ్ తేజ్ కెరీర్‌ అవినీతిమయమేనని రెవెన్యూ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. డబ్బులిస్తే గౌతమ్ తేజ్ ఏ పనైనా చేస్తాడని రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులు అంటున్నారని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అదికారి అంటున్నారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన గౌతమ్ తేజ్ తరువాత చేతివాటం చూపించి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడని వెలుగు చూసింది.

2019లో కారుణ్య నియామక విభాగానికి ఇన్‌ఛార్జిగా పనిచేసేటప్పుడు గౌతమ్ తేజ్ సుమారు 20 మంది అభ్యర్థుల వద్ద రూ. 75 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు వసూలు చేశాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయి బాధలో ఉన్న ఆ కుటుంబం నుంచి నిర్దాక్షిణ్యంగా డబ్బు వసూలు చేశాక గౌతమ్ వాళ్ల ఫైల్‌ను ప్రాసెస్‌ చేసేవాడని, డబ్బులు ఇవ్వనివారిని ఆఫీసు చుట్టూ తిప్పించుకున్నాడని ఆరోపణలున్నాయి. ఇలా చిత్తూరులో ఉద్యోగం చేసే సమయంలోనే కొందరు బడా నాయకులతో గౌతమ్ కు పరిచయాలు పెరిగాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Madanapalle sub collector office employee Gautham Tej is being pulled out by the police

పుంగనూరుకు చెందిన గౌతమ్ తేజ్ తరువాత మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అడుగుపెట్టాడు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన 22-ఏ సెక్షన్‌ లోనే గౌతమ్‌ తేజ్‌ ఇప్పుడు క్లర్కుగా పనిచేస్తున్నాడు. గౌతమ్ తేజ్ గత వ్యవహార శైలిని పరిశీలించిన రెవెన్యూ వర్గాలు పోలీసుల ముందు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటన కేసుకు సంబందించి గౌతమ్ తేజ్ తో పాటు పలువురు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

పోలీసుల విచారణలో గౌతమ్ తేజ్ మాత్రం నేరం ఒప్పుకోలేదని, అతను పోలీసుల విచారణకు సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. గౌతమ్ తేజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బందువులు, కొందరు స్నేహిత ఆర్థిక లావాదేవీల గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అనుచరుడిగా చెప్పుకుని ఇంతకాలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో చలామణి అయ్యాడని పోలీసు అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+