కావలికి ఉగ్రదాడి మృతుడు మధుసూదన్ పార్ధివదేహం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయిన వారిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో విశాఖకు చెందిన చంద్రమౌళి.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌రావు మృతి చెందారు. అయితే మధుసూదన్ భౌతికకాయాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గంలో కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నేడు కావలిలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధుసూదన్ పార్ధివదేహం చూసేందుకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పర్యవేక్షిస్తుండగా.. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరి నారాయణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అంత్యక్రియలలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులు, ముఖ్య నేతలు పాల్గొననున్నట్టు సమాచారం.

ఇక ఇప్పటికే ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతే కాకుండా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
మధుసూదన్ కుటుంబ నేపధ్యం..
మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి స్థానికంగా నివసిస్తూ.. బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ముందుగా ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో సంతానంగా మధుసూదన్‌రావు పుట్టారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేరారు. వృత్తిరీత్యా 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డ ఆయన అక్కడ సొంతింటిని కూడా నిర్మించుకున్నారు.
సమ్మర్ ట్రిప్ లో భాగంగా తన భార్య, కుమార్తె, కుమారుడుతో కలసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కానీ ఊహించని రీతిలో ఉగ్రవాదుల దాడిలో హతమయ్యారు. అయితే మధుసూదన్ మృతి చెందిన విషయాన్ని అతని తల్లితండ్రులకు చెప్పలేదని.. కేవలం గాయలైనట్టు చెప్పారని అంటున్నారు. ఇక చివరికి చానిపోయాడన్న వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పహల్గామ్ లో టెర్రర్ హతమైన మధు సూదన్ కు నివాళులు అర్పించిన మంత్రులు#MadhuSudhan #PahalgamTerroristAttack #Pahalgam #pahalgamattack #PahalgamTerrorAttack #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/vFFF8OuOym
— oneindiatelugu (@oneindiatelugu) April 24, 2025
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications